ఏపీలో నకిలీ చలాన్ల స్కాం కలకలం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నకిలీ చలాన్లతో ఏపీ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన ఘటనలు కలకలం సృష్టించాయి. కడప సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలాన్ల కుంభకోణం వెలుగుచూసిన తర్వాత రాష్ట్రంలో అన్ని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో 2018నుంచి ఆన్ లైన్ ద్వారా అప్ లోడ్ చేసిన చలాన్లపై పరిశీలన చేపట్టారు. గుంటూరు జిల్లాలో 35 సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డీఐజీ శ్రీనివాసరావు ఆదేశాలతో తనిఖీలు చేపట్టారు. మంగళగిరి సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలాన్లతో మోసం జరిగినట్లు గుర్తించారు. 2020 జనవరి నుంచి అప్ లోడ్ చేసిన చలాన్ల తనిఖీల్లో మోసాలు బయటపడ్డాయి. 2021 జనవరి నుంచి నకిలీ చలాన్లతో మోసం జరిగినట్లు గుర్తించారు.
దాదాపు ఎనిమిది మంది పూర్తిస్థాయిలో స్టాంప్ డ్యూటీ కట్టినట్లు చలాన్లు సమర్పించినా ప్రభుత్వ ఖజానాకు మాత్రం జమకాలేదు. దీంతో నకిలీ చలాన్ల ద్వారా మోసం చేసినట్లు అధికారులు తేల్చారు. మరికొన్ని డాక్యుమెంట్లలో చలాన్ల రూపంలో స్టాంప్ డ్యూటీ చెల్లించినట్లు చూపించినా సీఎంఎఫ్ఎస్ లో మాత్రం ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. దాదాపు 8మంది ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు అధికారుల తనిఖీల్లో తేలింది. దీంతో ఆస్థులు కొనుగోలు చేసి స్టాంప్ డ్యూటీ చెల్లించని వారికి అధికారులు నోటీసులు జారీ చేశారు. సబ్ రిజిష్ట్రార్ ఫిర్యాదుతో మంగళగిరి టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ చలాన్లతో ప్రభుత్వాన్ని మోసం చేసిన వారి వివరాలను కూడా అందించారు.
Also Read
- CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
- Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
ఫిర్యాదులో ఎవరెవరు ఎలా మోసం చేశారో, ఎంత మొత్తం మోసం చేశారో కూడా వివరించారు. దీంతో నకిలీ చలాన్ల మోసంపై విచారణ ప్రారంభించారు పోలీసులు. నకిలీ చలాన్లతో ప్రభుత్వ ఖజానాకు గండికొట్టిన ఘటనల్లో కొంతమంది డాక్యుమెంట్ రైటర్ల ప్రమేయం ఉందని, వారికి కొంతమంది సిబ్బంది కూడా సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ చలాన్ల కేసులో… కర్నూలు జిల్లా నంద్యాల సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులోని ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది. వీరు చలాన్లలో భారీ అవకతవకలకు పాల్పడినట్టు విచారణలో నిర్ధారించారు. మరికొందరు స్టాంప్ రైటర్లపై అధికారులు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
- Tags
- ap
- Fake challans
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!