విజయవాడ ఏ.ఆర్ కానిస్టేబుల్ దారుణ ఘటనకు పాల్పడ్డాడు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఐస్‌క్రీమ్ బండి యజమానిని హతమార్చాడు. ఐస్‌క్రీమ్ బండి యజమాని వెంకటేష్ ….తన ఇంట్లోకి చొరబడినట్లు సమాచారం అందుకున్న కానిస్టేబుల్ డ్యూటీలో నుంచి వెంటనే ఇంటికి చేరుకున్నాడు. వెంకటేష్‌ని పట్టుకుని తీవ్రంగా గాయపరిచారు ఏఆర్ కానిస్టేబుల్. ఈ దాడిలో వెంకటేష్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు వెంకటేష్. దాంతో అతని పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.