బోగస్ చలనాల కుంభకోణంపై సీఎం జగన్ ఆరా తీశారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. అక్రమార్కుల నుంచి సొమ్ము రికవరీపై ఫోకస్ పెట్టాలని సీఎం సూచించారు. ఇప్పటికే రూ. 40 లక్షల మేర సొమ్మును రికవరీ చేసినట్టు వెల్లడించిన అధికారులు… సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసినట్టు తెలిపారు. రిజిస్ట్రేషన్ల సాఫ్ట్ వేర్ ను ఎన్ఐసీ, సీఎఫ్ఎంఎస్ లకు అనుసంధానం చేయడం ద్వారా అవకతవకలకు చెక్ చెప్పొచ్చని సీఎంకు వివరించారు అధికారులు. దాంతో మరింత లోతైన దర్యాప్తు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించినట్లు తెలుస్తుంది.