పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై లోకేష్ చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయి. లోకేష్ తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. 2016లో స్పెషల్ ప్యాకేజ్ లో భాగంగా పోలవరం అంచనాలు 20వేల కోట్లకు కుదిస్తే చంద్రబాబు సంతకాలు చేశారు. కానీ సీఎం జగన్ సూచనల మేరకు పోలవరం నిధల కోసం పార్లమెంటు సమావేశాలు స్తంభింపచేశాం. ఇటీవలే పోలవరం సవరించిన అంచనాలు 47వేల కోట్లకు కేంద్రం…
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి మాట్లాడుతూ… ప్రపంచ చరిత్రలో మానవత్వం ఉండే నాయకుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకరు అని తెలిపారు. చరిత్ర పుటల్లో స్వర్ణక్షరాలతో రాయదగిన వ్యక్తి వైఎస్సార్. సమాజం మీద ప్రేమను చాటడమే కాకుండా కేవలం 5 ఏళ్ళల్లో ప్రజల జీవితాల్లో ఎంత ముద్ర వేయవచ్చో నిరూపించిన వ్యక్తి అని తెలిపారు. ఆయన నాటిన మొక్కే ఇవాళ జగన్ మహా వృక్షం అయి మన ముందు ఉన్నారు. తండ్రికి తగిన తనయుడు.…
వాళ్లిద్దరూ ఒకే తల్లి కడుపున పుట్టారు.. కానీ రాజకీయం ఆ అన్నాచెల్లెలును వేరుచేసింది. చెరో రాష్ట్రంలో చెరో దిక్కుగా విడిపోయారు. చెల్లెలి కోరిక అన్నకు నచ్చలేదు. కానీ రాజకీయ వారసత్వాన్ని చెల్లి కొనసాగించాలనుకుంది.. బంధం దూరమైనా ఆ తండ్రి చూపిన దారి మాత్రం వారిద్దరిని కలిపింది.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నాడు ఆయన బిడ్డలు వైఎస్ జగన్, షర్మిల కలిసిపోవడం వైఎస్ అభిమానులకు కన్నుల పండువగా మారింది ఈ పరిణామం కంటే ముందు చాలా విషయమే…
వైఎస్సార్ వర్ధంతి సభలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు ఎంపీ విజయసాయిరెడ్డి. జీవీఎంసీ మేయర్, కార్పొరేటర్ల కు కర్తవ్య బోధ చేసారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు… ఇక నుంచి అందరూ అభివృద్ధిపై దృష్టి పెట్టండి. అవినీతి రహిత పాలన, సమర్ధ నాయకత్వం ప్రజలు కోరుకుంటున్నారు. పదవుల విషయంలో అందరికి అవకాశాలు కల్పిస్తాం. ఇక్కడ కొన్ని ఆరోపణలు నా దృష్టికి వచ్చాయి. భూములు, పంచాయతీలు చేస్తున్నానని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. నాకు డబ్బు మీద ఆసక్తి లేదు.…
నిన్న మొన్నటి వరకు కూల్ కూల్ అన్నారు. టైమ్ వచ్చేవరకు ఓపిక పట్టాలని ఓదార్చారు. ఏమైందో ఏమో.. ఉన్నట్టుండి కాలు దువ్వుతున్నారు బాబాయ్ అబ్బాయ్. అందరి లెక్కలు రాస్తున్నాం.. తిరిగి చెల్లిస్తాం అని వార్నింగ్లు ఇస్తున్నారట. ఎందుకు గేర్ మార్చారు? వాళ్ల రాసుకుంటున్న లెక్కలేంటి? బాబాయ్, అబ్బాయ్లకు ఏమైందని తమ్ముళ్ల ప్రశ్న! వైసీపీ గాలిలో కూడా 2019 ఎన్నికల్లో గెలిచి నిలిచారు కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు. టెక్కలి నుంచి అచ్చెన్న ఎమ్మెల్యేగా గెలిస్తే.. రామ్మోహన్నాయుడు శ్రీకాకుళం ఎంపీగా…
కేఆర్ఎంబీ అధికారులపై తెలంగాణ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రజత్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏపీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ లేఖలు రాసి అధికారులను వేదిస్తోంది అని అన్నారు. కల్వకుర్తి లాంటి ప్రాజెక్టులు 1980లో శంకుస్థాపన చేశారు. అలాంటి ప్రాజెక్టు అనధికార ప్రాజెక్టు ఎలా అవుతుంది. ఏపీ రాసిన ప్రతీ లేఖ పై కేఆర్ఎంబీ-జీఆర్ఎంబీ తెలంగాణ వివరణ కోరడం ఏంటీ అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల పూర్వపరాలు తెలుసుకోకుండా బోర్డులు తెలంగాణకు సమాధానాలు ఇవ్వాలని…
ఈరోజు ఉదయం11 గంటలకు కృష్ణానది యాజమాన్య బోర్డ్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ స్పెషల్ సీఎస్ లు, ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్లు, కేఆర్ఎంబీ అధికారులు పాల్గొననున్నారు. మొత్తం 13 అంశాల ఎజెండాగా బోర్డ్ సమావేశం జరగనుంది. ఇరు రాష్ట్రాలకు కృష్ణ బేసిన్ లో నీటి కేటాయింపు, బోర్డుల పరిధి, బోర్డ్ తరలింపు ఇతర అంశాలపై చర్చించనున్నారు కేఆర్ఎంబీ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణ పనులు, పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ పనుల అంశాన్ని…
ఉత్తరాంధ్ర అభివృద్ధిపై టీడీపీ సవాళ్ళను స్వీకరించింది అధికార పార్టీ. అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ… ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లతో గెలిసిన టీడీపీ నేతలు చంద్రబాబు బంట్రోతుగా పని చేస్తున్నారు. టీడీపీ నేతల ఉత్తరాంధ్ర రక్షణ సమావేశం చూసి ప్రజలు సిగ్గు పడుతున్నారు. ఉత్తరాంధ్రను భక్షించిన వాళ్లే రక్షణ అంటూ మాట్లాడుతున్నారు. టీడీపీ నేతలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పిన సిగ్గు రాలేదు అన్నారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తే చంద్రబాబు అడ్డుకుంటున్నారు..అమరావతి కోసం…