40 ఇయర్స్ ఇండస్ట్రీ.. అపార చాణిక్యుడినంటూ చెప్పుకునే చంద్రబాబు చేసిన తప్పే మళ్లీ చేస్తుండటం విస్మయానికి గురిచేస్తోందని రాజకీయవర్గాల్లో హాట్ హాట్ చర్చ సాగుతోంది. గతంలో ఆయన నమ్ముకున్న రెండుకళ్ల సిద్ధాంతం బెడిసి కొట్టి చివరికి రాష్ట్ర విభజనకు దారితీసిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. దాని నుంచి ఆయన ఏం గుణపాఠం నేర్చుకున్నారో ఇప్పటికీ అర్థం కావడం లేదు. ఎందుకంటే ఆయన మళ్లీ మళ్లీ అదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ అందరినీ కన్ఫ్యూజన్ చేస్తున్నారని అంటున్నారు.…
నారా లోకేష్ పై స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత ఫైర్ అయ్యారు. తాజాగా ఎన్టీవీ తో మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ… లోకేష్ ప్రతిదాన్ని రాజకీయం చేస్తున్నాడు..రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాడు. ప్రభుత్వం స్పందించకపోతే పరామర్శ కి వెళ్ళాలి గాని స్పందించిన తరువాత కూడా పరామర్శ దేనికి. ఘటన జరిగిన ఎన్నో నెలలకి పరామర్శ ఏంటి అని ప్రశ్నించారు. దిశా చట్టం తీసుకు రావాలని సీఎం ని ఎవరు అడగలేదు. ఆడ బిడ్డల…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 61,363 శాంపిల్స్ పరీక్షించగా… 1,361 మందికి పాజిటివ్‌గా తేలింది.. మరో 15 మంది కరోనాబారినపడి మృతిచెందారు.. ఇదే సమయంలో 1,288 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 20,24,603కు.. రికవరీ కేసులు 19,96,143కు పెరిగాయి.. ఇక, కరోనాబారినపడి ఇప్పటి వరకు మృతిచెందినవారి…
నాయకులు ఎవరైనా ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేస్తారు… కానీ చంద్రబాబు, టీడీపీ మద్యపాన ఉద్యమం చేస్తాం అంటున్నారు అని ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు. చంద్రబాబుకు మద్యపాన నియంత్రణ ఇష్టం లేనట్లు కనిపిస్తోంది. ఎన్టీఆర్ పెట్టిన మద్యపాన నిషేధాన్ని ఎత్తేసిన వ్యక్తి చంద్రబాబు. మేము మద్యం షాపుల సంఖ్యను సగానికి తగ్గించాం. ఈర్ష్య, ద్వేషం, పగ…ఈ మూడు చంద్రబాబు లక్షణాలు. కాబట్టి ప్రజా కోర్టులో చంద్రబాబుకు ఉరిశిక్ష వేశారు అని పేర్కొన్నారు. తాగుబోతులు, మద్య…
ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులదే రాజ్యం. వారు ఎంత చెబితే అంత. ఎదురు తిరిగితే ఇంతే సంగతులు. ఎంతటి వారైనా కేడర్ చేతిలో దెబ్బలు తినాల్సిందే. కాదూ కూడదు అంటే ఎంతకైనా తెగిస్తుండటంతో.. అధికారపార్టీలో చర్చగా మారారు ఎమ్మెల్యే. ఇంతకీ ఎమ్మెల్యేకు తెలిసే అనుచరులు చేస్తున్నారా? తెలిస్తే ఎమ్మెల్యే ఎందుకు పట్టించుకోవడం లేదన్నదే ప్రశ్న. కేడర్ రెచ్చిపోతుంటే.. ఎమ్మెల్యే మౌనం! కర్నూలు జిల్లా ఆదోని. సాయిప్రసాద్‌రెడ్డి ఎమ్మెల్యే. ఇక్కడ సాయి ప్రసాద్‌రెడ్డి కంటే అధికారపార్టీ నేతలుగా.. ఎమ్మెల్యే…
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. తెలంగాణలో విస్తారంగా.. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండగా.. ఏపీలోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.. అయితే, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది వాతావరణశాఖ.. ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈనెల 11న ఏర్పడే అవకాశం ఉందని.. కోస్తా ప్రాంతానికి ఎల్లో మెస్సేజ్ హెచ్చరికలు జారీ చేసింది. నిన్న ఏర్పడిన అల్పపీడనం బలపడి ఈరోజు దక్షిణ ఛత్తీస్‌గఢ్ మరియు దక్షిణ ఒడిశా ప్రాంతాలలో కొనసాగుతోందని..…
వినాయక చవితి మీద విధించిన ఆంక్షలపై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆగర్హం వ్యక్తం చేసారు. జగన్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక విధానాలు అవలంబిస్తోంది. రంజాన్, క్రిస్మస్, మొహారం పండుగలపై లేని ఆంక్షలు వినాయక చవితిపై ఎందుకు అని అడిగారు. చర్చిలో ప్రార్థనలు, టీటీడీ లో దర్శనాలు, బస్సుల్లో ప్రయాణాలకు అనుమతించారు కదా…. వినాయక విగ్రహాలు ఆలయాల్లో పెడితే తప్పా… ఇళ్లల్లో పూజలు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పాలా… ఇళ్లలో పూజలకు ప్రభుత్వ అనుమతి అవసరమా అన్నారు. అలాగే…
నేతలు ఒకవైపు …కేడర్ మరోవైపు. ఇక ఎమ్మెల్యేదైతే అసలు ఏ దారో తెలియదు. ఇది అ నియోజక వర్గంలో అధికారపార్టీ పరిస్థితిపై జరుగుతున్న చర్చ. అధికారంలో ఉన్నా, ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ఉండటంతో అ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? చిత్తూరు జిల్లా సత్యవేడు నియోజక వర్గం అధికార వైసీపీలో పెద్ద చర్చకు కారణంగా మారింది. ఇక్కడ 2014 లో ఆదిమూలం పోటీచేసి ఓడిపోయారు. అయినా అధిష్ఠానం…
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 59,566 సాంపిల్స్ పరీక్షించగా.. 1,378 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో 10 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 1,139 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,16,680కు పెరగగా… రికవరీ కేసులు 19,88,101కు చేరాయి.. ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి 13,877…
రాష్ట్రంలో ఐదుగురు ఐఏఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీ హైకోర్టు. ఆ ఐదుగురు ఐఏఎస్ లకు జైలు శిక్షతో పాటుగా జరిమానా విధించింది. ఓ మహిళా భూమి తీసుకొని నష్ట పరిహారం ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నెల్లూరు జిల్లా తాళ్లపాక సాయి బ్రహ్మ భూ వ్యవహారంలో తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశించిన తర్వాత కూడా చెల్లింపుల జాప్యం పై సీరియస్ అయ్యింది న్యాయ స్థానం. ఆ ఐఏఎస్ అధికారుల జీతాల నుంచి కట్ చేసి…