మాకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మావోయిస్టు ప్రభావిత మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు, గ్రామాల్లో ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం అని విశాఖపట్నం రూరల్ ఎస్పీ తెలిపారు. గంజాయి, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, మూగజీవాల అక్రమ, రవాణా మావోయిస్టు సానుభూతి పరుల కదలికలపై చెక్ పోస్ట్ వద్ద విస్తృత తనిఖీలను నిర్వహిస్తున్నాం. దారకొండ ఏజెన్సీ ప్రాంతానికి పదికి పైగా వాహనాల్లో కొంతమంది వచ్చి ఇక్కడ అలజడి సృష్టించి వెళ్తున్నట్లుగా స్థానిక గ్రామస్తుల నుండి మాకు( పోలీసులకు)…
కండువా మార్చినా ఫేట్ మారలేదు. చిన్న పని కూడా కావడం లేదు. పార్టీ పెద్దలు గుర్తించినా లోకల్‌గా ఎమ్మెల్యేతో నిత్యం పోరాటమే. చికాకు తప్ప సంతృప్తి లేదు. చివరకు సొంత గూటిని వదిలి వచ్చి తప్పు చేశామా అని పునరాలోచనలో పడ్డారట ఆ మాజీ మంత్రి. వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్లిపోతే ఎలా ఉంటుందనే ఆలోచన ఉన్నట్టు టాక్. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ? మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి పునరాలోచనలో పడ్డారా? ఫ్యాక్షన్ రాజకీయాలతో ఒకప్పుడు…
తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అంటున్నారట ఆ మాజీ పోలీస్ అధికారి. ప్రస్తుతం అధికారపార్టీలో ఉన్న ఆయన… ‘మద్దాలి నిన్నొదల’ అని వెంట పడుతున్నారు. ఎమ్మెల్యేకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారట. ఇద్దరూ ఒకేపార్టీలో.. ఒకే గొడుకు కింద ఉన్నా.. రాజకీయ ఎత్తుగడలు గుంటూరు మిర్చిలా ఘాటెక్కిస్తున్నాయట. వారెవరో? ఆ గొడవేంటో ఈ స్టోరీలో చూద్దాం. మద్దాలిని ముప్పుతిప్పలు పెడుతున్న ఏసురత్నం! గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా నైరుతి గాలులు/ పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర మరియు యానాం : ఈరోజు, రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈరోజు, రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే…
చాలా కాలం వేచి చూసిన తర్వాత వారికి అధికార యోగం పట్టింది. పాలకవర్గంలోకి ఇలా వచ్చారో లేదో పెత్తనం చేయడం మొదలు పెట్టారు. విమర్శలు మూటగట్టుకుంటున్నారు. ఆ ప్రజాప్రతినిధుల దూకుడుకు కళ్లెం వేయడం అధికారులకు సవాల్‌గా మారిందట. వారెవరో ఏంటో లెట్స్ వాచ్! కొందరు కార్పొరేటర్లు సర్వ అధికారాలు ఉన్నాయని ఫీలవుతున్నారా? పదేళ్లకుపైగా ప్రత్యేక అధికారి పాలనలో సాగిన గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో 98 డివిజన్లకు ఇటీవలే ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గం కొలువు తీరింది.…
ఆ ఇద్దరి మీదా విచారణ ఉంటుందని మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ చేసిన వ్యాఖ్యలు చాలా దుమారం రేపాయి. ఇది ప్రభుత్వం అధికారిక వైఖరా? లేదా వాసిరెడ్డి పద్మ వ్యక్తిగత అభిప్రాయమా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ అధికార వైఖరి అయితే ఈ సమస్యను ప్రభుత్వం సీరియస్‌గానే పట్టించుకుంటోందని అనుకోవాలి. ఇద్దరు ముఖ్యల మీద ఆడియో టేపులు బయటపడటం సంచలనం! ఏపీలో ఇద్దరు అధికార ప్రజాప్రతినిధుల ఆడియో టేప్‌లు కలకలం సృష్టిస్తున్నాయి. ఇద్దరూ ప్రముఖులు కావడం..…
శ్రీకాకుళం సున్నాదేవి జంక్షన్ వద్ద జాతీయ రహదారి పై జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు పోలీసులు సిబ్బంది మరణించారు. మృతుల్లో ఒక ఏఎస్ఐ , ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్ , డ్రైవర్ ఉన్నారు. మందసలో ఆర్మీ జవాను అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. జీపు ఫ్రంట్ టైర్ పేలడంతో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది జీపు. దాంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులలో కృష్ణుడు( ఏఎస్ఐ) , ఆంటోని( హెచ్.సీ) ,…
కేంద్ర ప్రభుత్వం పట్టణాల్లో వ్యర్ధాల మేనేజమెంట్ పై దేశ వ్యాప్తంగా సర్వే చేసింది. దేశంలోనే అన్ని నగరాల్లో స్వచ్ఛ భారత్ కింద వ్యర్ధాల మేనేజ్మెంట్ లో సర్వే చేశారు. 9 నగరాలను కేంద్రం గుర్తిస్తే రాష్ట్రం నుండి 3 నగరాలు ఎంపిక అయ్యాయి అని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. తిరుపతి, విజయవాడ, విశాఖ పట్నంలు వాటర్ ప్లస్ సర్టిఫికెట్ కు ఎంపికయ్యాయి. అన్ని పట్టణాలను ఇలానే తయారు చేయాలని సీఎం ఆదేశించారు. టీడ్కో…
కలిసి పనిచేస్తేనే పార్టీ అయినా.. మరేదైనా సక్సెస్ అవుతుంది. కానీ.. అక్కడ ఆ నేతలు ఎక్కువగా వన్ మ్యాన్ షో చేస్తుంటారు. ఎవరికి వారే మైలేజ్ కోసం ప్రయత్నిస్తూనే ఇంకొకరికి చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తారు. ఎవరు చెప్పినా.. ఎంత చెప్పినా మారని ఆ నేతలతో ఆ పార్టీ కూడా ఎదుగూ బొదుగూ లేకుండా ఉంది. వర్గాలుగా విడిపోయిన తిరుపతి బీజేపీ.. ఎవరి శిబిరం వారిదే! ఆధ్యాత్మిక నగరం తిరుపతి కేంద్రంగా బీజేపీ కార్యకలాపాలు చురుగ్గా సాగుతుంటాయి.…