రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ… ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసే రాష్ట్రం గా ఆంధ్రప్రదేశ్ మారిపోయింది అని కామెంట్ చేసారు. ఎంతో మంది ఆర్థిక సలహాదారులు గా ఉన్న ఈ ప్రభుత్వం ఆర్థిక దయనీయమైన స్థితిలో ఉండడం దారుణం అని అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పటి వరకూ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదు. పోలవరం ప్రాజెక్టు కు సంబంధించి 4068 కోట్లు కు సంబంధించి కొర్రీలు వేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన 6 లక్షల కోట్ల రూపాయల అప్పుకు 7 శాతం చొప్పున 42 వేల కోట్లు ప్రతీ ఏడాది వడ్డీ చెల్లించాలి అని పేర్కొన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.