రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరనే నానుడి ఉంది. ఇది మరోసారి అక్షరాల నిజం కాబోతుంది. వారిద్దరి మధ్య కొన్ని దశాబ్ధాల స్నేహం ఉంది. ఏ పార్టీలో ఉన్న వారి మధ్య బంధం చెక్కు చెదరకుండా కొనసాగుతూ వస్తోంది. ఒకరి గెలుపును మరొకరు సెలబ్రెట్ చేసుకుంటూ ఉంటారు. దీంతో వీరిద్దరి మధ్య ఇప్పటి వరకు ప్రత్యక్ష ఫైట్ జరుగలేదు. కానీ అన్నిరోజులు ఒకలా ఉండవు కాదా? ఆ సమయం ఇప్పుడు వచ్చినట్లే కన్పిస్తోంది. మారుతున్న రాజకీయ…
కళ్ళు, చెవులు ఉన్న వారికి మోడీ ప్రభుత్వ కార్యక్రమాలు తెలుస్తాయి. నిన్న ఇందిరా పార్కు దగ్గర విపక్ష నేతలు ఇష్టం వచ్చి నట్టు మాట్లాడారు, అవాకులు చవాకులు మాట్లాడారు అని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ సొంత పార్టీ లోనే కుంపట్లు ఉన్నారు. తెలుగు దేశం కాంగ్రెస్ గా మార్చారు అని సొంత పార్టీ నేతలే అంటున్నారు. స్క్రిప్టు రైటర్ ల ను పెట్టుకొని తాత్కాలిక ఆనందం కోసం మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ మునిగిపోతున్న పడవ……
వైసీపీ అధికారంలోకి వచ్చి పట్టుమని రెండున్నరేళ్లు కూడా పూర్తి కాలేదు. అప్పుడే టీడీపీ నేతలు అసెంబ్లీని రద్దును చేసి జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్లాలంటూ సవాల్ విసురుతున్నారు. ఇప్పటికిప్పుడు అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. క్లియర్ కట్ గా వైసీపీనే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని సర్వేలు బల్లగుద్ది చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ నేతలు మాత్రం మేకపోతు గంభీర్యం ప్రదర్శిస్తుండటం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. 2019 ఎన్నికల్లో మొదలైన…
విశాఖ : ఏపీ ఫైబర్ నెట్ లాభాలు అప్పులు తీర్చడానికే సరిపోతుందని… గత ప్రభుత్వ అనాలోచిత , నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నిర్ణయాలు వల్ల నష్టం జరిగిందని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి తెలిపారు. సిఐడి విచారణ తర్వాత బాధ్యులైన అందరూ బయటకు వస్తారని… టెరా సాఫ్ట్ కు కాంట్రాక్ట్ లు ఇచ్చేప్పుడు అప్పటి మoత్రి మండలి ఏం చేసిందని ప్రశ్నించారు. ఆర్ధిక మంత్రి పరిశీలనలోకి రాకుండానే జరిగిందా…!? అని ప్రశ్నించారు. సమగ్ర దర్యాప్తు…
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. అయితే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 55, 525 శాంపిల్స్ పరీక్షించగా… 1174 మందికి పాజిటివ్‌గా తేలింది… మరో 09 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 1,309 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక, తాజా కేసులతో కలుపుకొని.. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,37, 353 కు…
గుంటూరు జిల్లా సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు రూట్ మార్చారా? తన కుమారుడికి సత్తెనపల్లి సీటు ఇస్తే చాలు.. తాను పోటీ నుంచి వైదొలుగుతానన్న రాయపాటి ఈసారి తన ఫ్యామిలీకి ఏకంగా రెండుసీట్లు ఇవ్వాల్సిందే అంటున్నారా? దాని వెనక ఆంతర్యం ఏంటి? అసలుదాన్ని పట్టాలంటే కొసరు అడగాల్సిందేనన్నదే రాయపాటి ప్లానా? కుమారుడికి సీటు కోసం రాయపాటి లాబీయింగ్! గుంటూరు రాజకీయాలను ఒంటిచేత్తో శాసించిన రాయపాటి సాంబశివరావు వారసుడిని రంగంలోకి దింపడానికి రెడీ అవుతున్నారట. గత ఎన్నికల్లోనే కుమారుడు…
అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “లవ్ స్టోరీ”. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అమిగోస్ క్రియేషన్స్‌తో కలిసి నారాయణ్ దాస్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ సెప్టెంబర్ 24న విడుదలకు సిద్ధమవుతోంది. ముందుగా ఈ సినిమాను సెప్టెంబర్ 10న…
టీడీపీ నేతల పై చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆగ్రహం వ్యక్తం చేసారు. టీడీపీ నేతలకు రైతులపై ప్రేమ కాదు డ్రామా అని ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ అన్నారు. ఎప్పుడైనా టీడీపీ ఉద్యానవన పంటలపై దృష్టి పెట్టిందా అని అడిగారు. జీడి క్వింటాకు 9200 ఇచ్చిన ఘనత వైసీపీదే. వ్యవసాయం అంటే టీడీపీ హయాంలో దండగ, అదే వైయస్ హయాంలో వ్యవసాయం పండగ అని తెలిపారు. రైతులకు నష్టం కలిగిస్తే పుట్టగతులు ఉండవు. పంట సాగులో ఇప్పుడు…
అపథ మొక్కుల వాడికే అపద వచ్చింది అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. అది టీటీడీ దేవస్థానమా, వైసీపీ దేవస్థానమా, జగన్ రెడ్డి దేవస్థానమా అని ప్రశ్నించారు. పాలకమండలి సభ్యులు మరియు ఎక్స్ అఫిషియో సభ్యులు 29 మంది, ప్రత్యేక అహ్వానితులుగా 50 మంది ఉన్నారు. ఇది అన్యాయం, అపచారం, ఇది రూల్స్ కి వ్యతిరేకం. వర్క్ బోర్డ్ మరియు క్రిస్టియన్ కి సంభందించిన సంస్థల్లో కలుగజేసుకు నే ధైర్యం ప్రభుత్వానికి…
అమరావతి : డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల బదిలీలకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బదిలీల విధి విధానాలు ఖరారు చేస్తూ ఉత్తర్వులను కూడా విడుదల చేసింది ఆంధ్ర ప్రదేశ్ సర్కార్. ఈ నెలాఖరు లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఐదేళ్లు.. అంతకు మించి ఒకే చోట పని చేసిన వారికి తప్పని సరిగా బదిలీలు వర్తిస్తాయని స్పష్టం చేసింది ఏపీ సర్కార్.…