ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో స్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశం నిర్వహించింది. రాష్ట్రంలో భారీ టూరిజం ప్రాజెక్టులపై బోర్డులో చర్చ జరిపారు. ఏపీలో పర్యాటకరంగానికి ఊతం ఇచ్చే దిశగా పలు కిలక ప్రాజెక్టులు రానున్నాయి. ఒక్కో ప్రాజెక్టు పై కనీసం రూ.250 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు. వివిధ ప్రాజెక్టులపై మొత్తంగా రూ.2868.6 కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నారు. దాదాపు 48 వేల మందికి ఉద్యోగ అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుల ద్వారా కొత్తగా అందుబాటులోకి 1564 హోటల్ గదులు రానున్నాయి. ఐదేళ్లలో పూర్తి చేసే లక్ష్యంతో కార్యాచరణ జరుగుతుంది. విశాఖపట్నం, తిరుపతి, గండికోట, హార్సిలీ హిల్స్, పిచ్చుకలంకలో రిసార్టులు రానున్నాయి. ప్రముఖ సంస్థ ఓబెరాయ్ ఆధ్వర్యంలో రిసార్టులు రానున్నాయి. ఓబెరాయ్ విలాస్ బ్రాండ్‌తో రిసార్టులు వస్తాయి.
ఇక విశాఖపట్నం శిల్పారామంలో హయత్ ఆధ్వర్యంలో స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్… తాజ్ వరుణ్ బీచ్ పేరుతో విశాఖలో మరో హోటల్, సర్వీసు అపార్ట్‌మెంట్… అలాగే విశాఖపట్నంలో టన్నెల్ ఆక్వేరియం… స్కైటవర్ నిర్మాణం మరియు విజయవాడలో హయత్ ప్యాలెస్ హెటల్ రానున్నాయి.