ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. అయితే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 30, 515 శాంపిల్స్ పరీక్షించగా… 429 మందికి పాజిటివ్గా తేలింది… మరో 5 మంది కరోనా బాధితులు కన్నుమూశారు.. ఇదే సమయంలో 1,029 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. ఇక, తాజా కేసులతో కలుపుకొని.. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,53, 192 కు…
సీఎం జగన్ సొంత జిల్లా కడపలో ఉప ఎన్నిక హీట్ పెంచింది. వైసీపీ ఎమ్మెల్యే మృతితో బద్వేల్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ షూరు అయ్యింది. అక్టోబర్ 30న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 2న ఫలితాలు వెల్లడికానున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి. వైసీపీ నుంచి మృతిచెందిన ఎమ్మెల్యే భార్యకే అధిష్టానం టికెట్ కేటాయించింది. టీడీపీ సైతం తమ అభ్యర్థిని ప్రకటించి ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇక జనసేన…
కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయిన విషయం తెలిసిందే. అక్కడ వైసీపీ ఎమ్మెల్యే చనిపోవడంతో ఈ ఎన్నికలు వచ్చాయి. అయితే ఈ ఎన్నికలకు ఇప్పటికే దూరంగా ఉండనున్నట్లు చనిపోయిన వ్యక్తి సతీమణిని గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నామని, ఎన్నికను ఏకగ్రీవం చేసుకోవాలని కోరుతున్నట్టు పవన్ పేర్కొన్నారు. అయితే బద్వేలు ఉప ఎన్నికకు దూరం ఉండనున్నట్లు టీడీపీ కూడా తాజాగా ప్రకటించింది. ఈరోజు పొలిట్ బ్యూరోలో ఈ నిర్ణయం తీసుకుంది టీడీపీ.…
ఆ నియోజకవర్గానికి ఇంఛార్జ్ లేరు. ఆ పదవికోసం చాలామంది క్యూ కడుతున్నారు. మాకంటే మాకు ఇంచార్జ్ పదవి ఇవ్వాలని అధినేతకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంతకీ ఏంటా నియోజకవర్గం? ఎవరా నాయకులు? సత్తెనపల్లి టీడీపీ ఇంఛార్జ్ పదవి కోసం పోటీ..! సత్తెనపల్లి నియోజకవర్గం ఇప్పుడు గుంటూరు జిల్లా టీడీపీలో హాట్ టాపిక్. జిల్లాలో 17 నియోజకవర్గాలుంటే 16చోట్ల టీడీపీకి ఇంఛార్జ్లు ఉన్నారు. ఒక్క సత్తెనపల్లికి మాత్రమే ఇప్పటివరకూ తెలుగుదేశంపార్టీ ఇంఛార్జ్గా ఎవరినీ నియమించలేదు. గతంలో టీడీపీ సీనియర్ నేత…
ఏపీలో ఇవాళ కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 56, 463 శాంపిల్స్ పరీక్షించగా.. 809 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 10 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు.. ఇదే సమయంలో 1,160 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్లో పేర్కొంది సర్కార్. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,83,50, 167 కరోనా నిర్ధారణ…
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రీలీజ్ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై మాటల మంటలు రేపారు.. సినిమా సమస్యలతోపాటు రాజకీయ అంశాలను లేవనెత్తారు. వైసీపీ సర్కారును టార్గెట్ చేస్తూ పవన్ కల్యాణ్ సంధించిన విమర్శలు వివాదాస్పదంగా మారాయి. పవన్ వ్యాఖ్యలను తిప్పికొట్టేందుకు వైసీపీ మంత్రులు, నేతలు, సానుభూతి పరులు రంగంలోకి దిగారు. ప్రతీగా జనసైనికులు సైతం నిరసనలకు దిగడంతో తెలుగు రాజకీయం రంజుగా సాగింది. దీంతో జనసేన వర్సెస్…
ముహూర్తం దగ్గర పడుతోంది. అలాగే ఆశావహుల్లో టెన్షన్ కూడా పెరిగిపోతోంది. జిల్లాకు ఎన్ని పదవులు వస్తాయో ఏమో కానీ.. వాటికోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య మాత్రం చాలానే ఉంది. అయితే సీనియారిటీ, సామాజిక కోణాల్లో అధినేత వేటికి ప్రాధాన్యం ఇస్తారో అర్థంకాక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఆశావహులు. అనంతలో మంత్రి పదవి కోసం ఐదుగురు పోటీ..! ప్రస్తుతం అనంతపురం అధికారపార్టీలో వినిపిస్తున్నది ఒక్కటే మాట. నెక్ట్స్ మంత్రిగా ఎవరికి ఛాన్స్ వస్తుంది. త్వరలోనే కొత్త మంత్రివర్గం ఏర్పాటుకు అవకాశాలు…
నవ్యాంధ్రలో ఫ్యాన్ గాలి జెట్ స్పీడుతో వీస్తుందనడానికి కిందటి సార్వత్రిక ఎన్నికలే నిదర్శనంగా నిలిచాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరికీ సాధ్యంకానీ రీతిలో జగన్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఏపీలో 175 అసెంబ్లీ సీట్లకు గాను వైసీపీ ఏకంగా 151 సీట్లను సాధించి ఘనవిజయం సాధించింది.. వైసీపీకి ఈ గెలుపు చిరస్మరణీయమైన గుర్తుగా మిగిలిపోగా.. ప్రతిపక్షాలకు మాత్రం పీడకలను మిగిల్చాయి. నాడు మొదలైన వైసీపీ వేవ్ నిన్నటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల వరకు కొనసాగింది. …
మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ కాంగ్రెస్ పార్టీపై షాకింగ్ కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ పార్టీకి లీడర్లు లేరు.. కేడర్ లేదు. ఇదే పెద్ద సమస్య అని ఆయన తెలిపారు. రాజా మహరాజాల రోజులు కావు.. అందుకే పంజాబ్ లో సీఎంను తీసి అవతల పారేశారు అన్నారు. కొన్ని నిర్ణయాలు చేయాలనుకుంటారు.. చేస్తారు.. వైెెఎస్సారును సీఎం చేయొద్దని చెప్పాను.. కానీ చేశారు. కాబట్టి మా కాంగ్రెస్ పార్టీలో ఏ క్షణమైనా.. ఏమైనా జరగొచ్చు అని పేర్కొన్నారు. ఇక…
ఈ రోజు తూర్పు గాలులలోని అవర్తనము ఆగ్నేయ బంగళాఖాతం నుండి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు వ్యాపించి సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిమి ఎత్తు వరకు కొనసాగుతుంది. నిన్నటి తీవ్ర అల్పపీడనం ఈ రోజు పశ్చిమ ఉత్తర ఝార్ఖండ్ మరియు పరిసర బీహార్ ప్రాంతంలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుంచి 7.6కిమి ఎత్తు వరకు కొనసాగుతుంది. ఈ రోజు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలా ప్రదేశములలో, రేపు అనేక ప్రదేశములలో…