వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కేవలం ప్రభుత్వ కార్యక్రమాలపైనే ఫోకస్ పెట్టారు. గడిచిన రెండున్నరేళ్లుగా ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది పెద్దగా లేదు. అనునిత్యం ఏపీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపైనే దృష్టిసారించారు. ఆయన పాలనపై ప్రజలు సంతృప్తి చేస్తుండగా పార్టీలో మాత్రం కొంత గ్యాప్ వచ్చినట్లు కన్పిస్తుంది. దీనిని దూరం చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారు. ఈమేరకు పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలకు వరుసగా అపాయింట్మెంట్ ఇస్తూ నేతల మధ్య విబేధాలు దూరం చేసేలా…
ఏపీలో వైసీపీ ఎన్నికల మూడ్‌లోకి వెళ్తోందా? ఇప్పటి నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకుంటోందా? ముందుగా అనుమానాస్పద అధికారులపై ఫోకస్ పెట్టిందా? ఆఫీసర్ల చెక్‌లిస్ట్ సిద్ధం చేస్తోందా? ఆ జాబితాలోకి వచ్చే అధికారులను ఏం చేస్తారు? సచివాలయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? అధికారులకు ఉన్న రాజకీయ ఉద్దేశాలపై ఆరా..!? ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉన్నా.. క్రమంగా ఎలక్షన్ మూడ్‌లోకి తీసుకెళ్తున్నారు సీఎం జగన్. మంత్రులు మొదలుకుని.. క్షేత్రస్థాయిలోని పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సమాయత్తం…
గుజరాత్ లోని ముంద్రా పోర్టులో మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఆ హెరాయిన్ కు ఏపీకి ఎలాంటి సంబంధం లేదు అని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బట్ట కాల్చి మీద వేయటం టీడీపీ అలవాటే అని చెప్పిన ఆయన టీడీపీ ట్రైనింగ్ మేరకే రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నేతలంతా మాట్లాడుతున్నాడు. దర్యాప్తు సంస్థలను తప్పుదోవ పట్టించేందుకే విజయవాడ తప్పుడు అడ్రెస్ ఇచ్చారు. 8 ఏళ్ల క్రితమే మాచవరం సుధాకర్ ఏపీ విడిచి చెన్నై వెళ్లిపోయారు.…
నగరి ఎమ్మెల్యే రోజా పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రత్యర్థి వర్గం నేత, శ్రీశైలం ట్రస్టు బోర్డ్ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి. ఆయన మాట్లాడుతూ.. రోజాను రెండుసార్లు కష్టపడి మేము గెలిపించాము. అందుకు ఇప్పుడు మా చెప్పుతో మేము కొట్టుకోవాలి అన్నారు. రోజాకు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఇండిపెండెంట్ గా నిలబడతాను. నాపై ఆమె గెలవగలదా అని ప్రశ్నించారు. ఫైర్ బ్రాండ్ అంటూ చెప్పుకోవడం కాదు. మండలంలో రోజా బలపరిచిన ఒక్క ఎంపీటీసీ మాత్రమే గెలిచారు. మేము…
వైసీపీ ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతుందనే ప్రచారం నేపథ్యంలో టీడీపీ సైతం అలర్ట్ అవుతోంది. ఈమేరకు ఆపార్టీ తమతో కలిసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమేననే సంకేతాలను తాజాగా పంపిస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల వెల్లడైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలను ఆపార్టీ వినియోగించుకుంటోంది. ఓవైపు వైసీపీకి ఎంపీపీ పీఠాలు దక్కకుండా చెక్ పెడుతూ వచ్చే ఎన్నికల్లో పొత్తులకు ఇప్పటి నుంచి ప్రణాళికలను రచిస్తోంది. దీనిలో భాగంగానే జనసేన పార్టీని టీడీపీ నేతలు లైన్లో పెడుతున్నట్లు అర్థమవుతోంది. రాష్ట్ర…
అప్పట్లో ఇంఛార్జ్‌గా ఉన్న నాయకుడు.. తిలకం దిద్ది మీకే పోస్ట్ అని హామీ ఇచ్చారు. ఇంతలో ఆ ఇంఛార్జే మారిపోయి కొత్త నేత వచ్చారు. అసలే పాత, కొత్త ఇంఛార్జుల మధ్య ఆధిపత్య పోరు ఉండటంతో గత హామీలపై ఆ ఎఫెక్ట్ పడింది. పరిషత్ ఫలితాల తర్వాత రాజకీయం రసవత్తరంగా మారింది. ఆ నియోజకవర్గం ఏంటో.. వారెవరో ఇప్పుడు చూద్దాం. దువ్వాడ, పేరాడ మధ్య నందిగాం పంచాయితీ! శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీలో నాయకులెక్కువ. వారి మధ్య…
గెలుపోటములు దైవాదీనం. ఎవరినీ ఎప్పుడు ఎలా అదృష్టం వరిస్తుందో ముందుగానే చెప్పడం కష్టం. రాజకీయాల్లోనూ ఇలాంటి సంఘటనలే పునరావృతం అవుతూ ఉంటాయి. ఇక్కడ ప్రత్యర్థుల ఎత్తులను ముందుగానే తెలుసుకొని చిత్తు చేయాల్సి ఉంటుంది. అలాగే జనాల్లో ఫేస్ వాల్యూను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి పార్టీ అధినేత చరిష్మా కూడా తోడైతే ఇక అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది. కేవలం అధినేత ఫొటోతోనే గెలుపు సాధ్యమా? అంటే ఇందులో కొంత వాస్తవం ఉందనే చెప్పొచ్చు.…
ఆ జిల్లాలో వారి బాధను టీడీపీ నేతలు ఎవరూ పట్టించుకోవడం లేదట. వరస ఓటములతో ఆత్మవిశ్వాసం దెబ్బతింటోందని గగ్గోలు పెడుతున్నా వినేవాళ్లే లేరట. ఇక లాభం లేదని అనుకున్నారో ఏమో.. మీకు ఇదే లాస్ట్ ఛాన్స్ అని నేతలకు వార్నింగ్ ఇస్తున్నారట. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. చంద్రబాబును మించిన ఆవేదనలో టీడీపీ తమ్ముళ్లు..! 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో టీడీపీ నుంచి ఒక్క చంద్రబాబే గెలిచారు. మిగిలినచోట్ల వైసీపీదే విజయం. అది మొదలు.. పంచాయతీ,…
ఏపీలో టీడీపీకి విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయా? గవర్నర్ అపాయింట్మెంట్ పొందడంలోనూ ఆ పార్టీ విఫలం అవుతోందా? లోపం ఎక్కడుంది? టీడీపీలో జరుగుతున్న చర్చ ఏంటి? ప్రణాళికలో లోపమా? మరేదైనా కారణమా? రాజకీయ పార్టీలు గవర్నర్‌తో భేటీ కావడం సాధారణం. ప్రభుత్వాలపై ఫిర్యాదు చేసేందుకు.. వివిధ విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు రాజ్‌భవన్‌కు వెళ్తుంటారు నాయకులు. గవర్నర్ వ్యవస్థపై టీడీపీకి మొదటినుంచి తీవ్ర అసంతృప్తి ఉన్నా.. ఆయా సందర్భాలలో రాజ్‌భవన్‌కు వెళ్లిన ఉదంతాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షంలో…