పోలీసు పరాక్రమాలు తెలియజేసే ” క్రాక్ ” చిత్రాన్ని అనంతపురం త్రివేణి కాంప్లెక్స్ లోని బిగ్ సి థియేటర్ లో ప్రదర్శించారు. పోలీసు అమర వీరుల వారోత్సవాలలో భాగంగా అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు ఈ చిత్రాన్ని ప్రదర్శింపజేశారు. దీంతో వందలాది మంది విద్యార్థులతో బిగ్ సి థియేటర్ కిటకిటలాడింది. ఈ చిత్రంలో హీరో రవితేజ పోలీసు అధికారిగా పరాక్రమ విధులు నిర్వర్తించడం ప్రేక్షకుల్ని ఆలోచింపజేసింది. ఈ చిత్ర ప్రదర్శన కార్యక్రమంలో ఓఎస్డీ రామకృష్ణ ప్రసాద్ , ఏ.ఆర్ అదనపు ఎస్పీ హనుమంతు తోపాటు పలువురు పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.