ఈమధ్యకాలంలో యువత దూకుడుకి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఖాళీ సమయం, ఖాళీ ప్రదేశం కనిపిస్తే చాలు స్పోర్ట్స్ బైక్ లు, ఖరీదైన బైక్‌లతో రోడ్లపై హల్ చల్ చేస్తున్నారు. అడ్డుగా ఎవరైనా వస్తే ఇక అంతే సంగతులు. వారిపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా విశాఖలో బైక్ రైడర్స్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 39 బైక్‌లు 44 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విశాఖలో ఏసీపీ హర్షిత చంద్ర మీడియాకు వివరాలు అందచేశారు.
వీకెండ్ సందర్భంగా యువత రెచ్చిపోతున్నారు. శనివారం 200 మంది బీచ్ లో రేసింగ్ చేసేందుకు వచ్చారన్నారు. అక్కడ పోలీసులు నిఘా ఉండటంతో వీరు సిరిపురం,కాంప్లెక్స్,స్వర్ణభారతి స్టేడియం వద్ద బైక్ రైడ్ చేస్తూ అల్లరి అల్లరి చేశారు. స్వర్ణభారతి స్టేడియం వద్ద ఆర్టీసీ బస్సు అడ్డువచ్ఛిందని ఆర్టీసీ డ్రైవర్ ను కొట్టారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా గ్రూపుగా ఏర్పాడి ఈ రేసింగ్ కు పాల్పడ్డారని ఏసీపీ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా గ్రూపులు ఏర్పాటు చేసుకోని ఇలాంటి రేసింగ్ పాల్పడుతున్నారు.
ఈ రేసింగ్ పాల్పడిన వారిలో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు…కొంత మంది ఎంప్లాయిస్ ఉన్నారు..కొంత మంది లేబర్ కూడా ఉన్నారు. ఈ రేసింగ్ కు సంబంధించి 13 మంది పై కేసులు నమోదు చేసామని హర్షిత చంద్ర వివరించారు. రేసింగ్ జరిగే 10 ప్రదేశాలు గుర్తించామని అక్కడ నిఘా ఏర్పాటుచేస్తామన్నారు. రేసింగ్ లో పాల్గొన్న వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇస్తున్నామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటివి సహించబోమన్నారు ఏసీపీ హర్షిత చంద్ర.
Krithi Shetty: ఆ దర్శకుడు బాగా ఇబ్బంది పెట్టాడు