రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ 49వ రోజుకు చేరింది. నేడు చంద్రబాబుతో కుటుంబ సభ్యులు, టీడీపీ సీనియర్ నేతలు ములాఖత్ కానున్నారు. స్కిల్ డవలప్ మెంట్ స్కాం కేసులో గత నెల 9వ తేదీన బాబు అరెస్టయిన విషయం తెలిసిందే. నవంబర్ 1వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్ గడువు ఉంది. నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి 3వ రోజు పర్యటన కొనసాగనుంది. టీడీపీ…
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కి ఏపీ ఆర్థిక అంశాలపై ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఏపీ అప్పుల ప్రకటన విషయంలో కేంద్రం తీరుపై పురంధేశ్వరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వ అప్పు రూ. 4.42 లక్షల కోట్లేనని కేంద్రం చెప్పడంతో ఏపీలో బీజేపీకి ఇబ్బందిగా మారిందని లేఖలో పురంధేశ్వరి పేర్కొన్నారు.
పాక్ ఆర్థిక సంక్షోభం: ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దాయాది దేశం పాకిస్తాన్, కనీసం తన ప్రభుత్వ ఎయిర్ లైనర్ సంస్థ అయిన పాక్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) కష్టాలు తీర్చే పరిస్థితిలో కూడా లేదు. పీఐఏకి ఇంధనాన్ని సరఫరా చేస్తున్న పాకిస్తాన్ స్టేట్ ఆయిల్(పీఎస్ఓ) ఇకపై ఇంధనాన్ని సరఫరా చేసేది లేదని స్పష్టం చేసింది. పీఐఏ, పీఎష్ఓకు భారీగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఇవి చెల్లించనిదే, ఇంధనాన్ని సరఫరా చేయనని తెలిపింది. మరోవైపు పీఐఏని ఆదుకునేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం…
తిరుమలలో నేటితో ముగియనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు: తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేటితో ముగియనున్నాయి. ఈ ఉదయం వరాహ పుష్కరిణిలో స్వామివారి చక్రస్నాన మహోత్సవం వేడుకగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామికి స్నప్న తిరుమంజనాని అర్చకులు నిర్వహించనున్నారు. ఇక, చక్రతాళ్వార్‌కీ అర్చకులు పుష్కరిణిలో శ్రీవారికి అవబృద్ద స్నానం చేయించనున్నారు. దీంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. ఇవాళ రాత్రి బంగారు తిరుచ్చి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి తిరుమల మాడ…
విజయదశమి పండుగ సమయంలో టీడీపీ నిరసనలపై పోలీసులు అలర్ట్ అయ్యారు. జగనాసుర దహనం పేరిట నిరసనలకు నారా లోకేష్ పిలుపునిచ్చిన నేపథ్యంలో టీడీపీ నిరసనల వల్ల హింస చెలరేగే అవకాశం ఉందని పోలీసుల ముందస్తు చర్యలు తీసుకున్నారు. ప్రజల విశ్వాసాలను, మనోభావాలను దెబ్బతీసే నిరసనల వల్ల ఘర్షణలు తలెత్తే అవకాశాలపై అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి పోలీసు అధికారుల ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు టీడీపీ…
ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు డలంలోని దుగ్గిరాలపాడు గ్రామంలో 5 కోట్ల రూపాయల మేరకు కుచ్చు టోపీ పెట్టారు. హైదరాబాద్ లో రాథారాం మార్కెటింగ్ కంపెనీ బోర్డ్ తిప్పేసింది. ఇరు రాష్ట్రాల్లో సుమారు 2 వేల కోట్ల రూపాయల వరకు వసూలు చేసి ఉంటారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నూతన విద్యా విధానంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలియకుండా మాట్లాడుతున్నారని, కుంభకోణాలు అని అంటున్న పవన్‌కు తెలియకపోతే తన వద్దకు వస్తే ట్యూషన్ చెబుతాను అని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైసీపీ పాలనలో జరిగిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించేందుకు సామాజిక న్యాయ బస్సు యాత్ర చేపట్టామన్నారు. విశాఖ గ్రాండ్‌వేలో వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. మొదటి దశలో 12 రోజుల పాటు సామాజిక న్యాయ…
52 మందితో బీజేపీ తొలి జాబితా: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. 52 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. బీసీలతో పాటు సీనియర్లకు కూడా జాబితాలో చోటు కల్పించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు ఎంపీలు బరిలో నిలిచారు. కరీంనగర్ నుంచి బండి సంజయ్, బోథ్ నుంచి సోయం బాపురావు, కోరుట్ల నుంచి ధర్మపురి అరవింద్ పోటీ చేస్తున్నారు. హుజారాబాద్‌తో పాటు గజ్వేల్ నుంచి ఈటల రాజేందర్…
దుర్గాదేవిగా దర్శనం ఇస్తున్న పెద్దమ్మ తల్లి: జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి ఈరోజు శ్రీ దుర్గాదేవిగా ఎరుపు రంగు చీరలో దర్శనం ఇస్తారు. ఎర్రటి మందారాలు, గులాబీ పూలతో అమ్మవారిని పూజిస్తారు. కదంబం, శాఖ అన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఈరోజు ఎరుపురంగు చీరలు దానం చేస్తే మంచిది. ఈరోజు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారు శత్రువులపై విజయం సాధిస్తారు. దశమి రోజే ఆయుధ పూజ కూడా ఉంటుంది. దశమి రోజు అమ్మవారికి భక్తులు ప్రత్యేక పూజలు అందిస్తారు.…
స్కిల్ స్కాం కేసులో అరెస్టైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు రిమాండ్ 44వ రోజుకు చేరింది. గత నెల 9న అరెస్టైన చంద్రబాబు రిమాండ్ నవంబర్ 1 వరకు కొనసాగనుంది. సెలవు దినాలు కావడంతో మూడు రోజులు ములాఖత్‌లు నిలిపివేయబడ్డాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. నేటి సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం. ఈ వాయుగుండం ప్రభావంతో వచ్చే మూడు రోజులు కోస్తాలో వర్షాలు పడే అవకాశం ఉంది. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా…