Cyclone Michaung: మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్.. నేడూ పలు రైళ్ల రద్దు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Many trains canceled on Wednesday in AP: ‘మిచాంగ్’ తుపాను ఏపీలోని పలు జిల్లాలను కుదిపేసింది. తుపాను ప్రభావంతో కురుస్తున్న కుండపోత వర్షాలకు జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు, 80-110 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులతో ఏపీలోని పట్టణాలు, పల్లెలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ప్రధాన రోడ్లపై మోకాళ్ల లోతుకు పైగా నీళ్లు ఉండడంతో చాలా ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
మిచాంగ్ తుపాను తీరం దాటడంతో.. రైల్వే యంత్రాంగం అప్రమత్తమైంది. విజయవాడ డివిజన్ పరిధిలోని స్టేషన్లలో ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా భారీగా రైళ్లను రద్దు చేసింది. దాంతో నిత్యం కిటకిటలాడే విజయవాడ స్టేషన్ రైళ్ల రద్దుతో ప్లాట్‌ఫారాలు ఖాళీగా మారాయి. మిచాంగ్ తుపాను నేపథ్యంలో బుధవారం (డిసెంబర్ 6) కూడా పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Also Read
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
- Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
- IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
గుంటూరు- రేపల్లె (07784/07785), గుంటూరు-రేపల్లె (07786), రేపల్లె-తెనాలి (07873/07874), రేపల్లె-తెనాలి (07875/07876), రేపల్లె-తెనాలి (07787/07888), గుంటూరు-రేపల్లె (07887), చెన్నైసెంట్రల్-న్యూజల్పాయిగురి (22611) వెళ్లే రైళ్లు పూర్తిగా రద్దు అయ్యాయి. తుపాను కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను బుధవారం నుంచి పునరుద్ధరించారు. సికింద్రాబాద్-గూడూరు (12710), తిరుపతి-లింగంపల్లి (12733), సికింద్రాబాద్-తిరుపతి (12764), కాకినాడటౌన్-బెంగళూరు (12710) రేపటి నుంచి నడవనున్నాయి.
తాజావార్తలు
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
-
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
-
Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్కు ఆసియా కప్ ట్రోఫీలు!
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!