మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వ్యాఖ్యలను ఖండిస్తున్నాను అని మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం ఏపీలో ఏమీ ఉండదు అని ఆమె పేర్కొన్నారు. మహిళలకు ఏపీలో పూర్తి స్ధాయి అవకాశాలు కల్పిస్తున్నారు.. డైవర్షన్ పాలిటిక్స్ టీడీపీకి కొత్తేం కాదు.. పవన్ కళ్యాణ్ కొత్తగా టీడీపీతో జతకట్టలేదు.. పవన్ టీడీపీతోనే ఉన్నారు అంటూ మంత్రి ఆరోపించారు.
ఏపీలో పగటి ఉష్ణోగ్రతలు తారా స్థాయికి చేరుకున్నాయి. నైరుతి రుతుపవనాల తిరోగమనం కారణంగా ఎండ తీవ్రత ఆకస్మాత్తుగా రెండు నుంచి మూడు డిగ్రీలకు పెరిగిపోయింది. దీనితో భానుడు భగభగ మంటున్నాడు.
నేడు సుప్రీంకోర్టులో ‘ఓటుకు నోటు’ కేసు: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు సంచలనం సృష్టిచింది. నేడు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రానుంది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సుందరేష్ ల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. 2017లో ఓటుకు నోటు కేసులో రెండు పిటిషన్లను మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి వేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలంటూ ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తెలంగాణ ఏసీబీ నుంచి…
నేడు ఏపీ హైకోర్టులో నారా చంద్రబాబు, నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు విచారణ జరగనుంది. ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్, స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు మీద ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నేడు సీఐడీ విచారణకు రావాలన్న నోటీసులపై తన ఇంటి వద్దే విచారణ చేయాలని మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.…
పొలిటికల్ కరప్షన్ లేని జనసేన-టీడీపీ ప్రభుత్వాన్ని 2024లో తీసుకొచ్చి సమస్యలు పరిష్కరిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏపీలో వచ్చేది జనసేన- టీడీపీ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం కనుక మేం చర్యలు తీసుకుంటాం.. ప్రతీ సభలో ఈ సమస్యపై మాట్లాడుతాను అని పవన్ కళ్యాణ్ అన్నారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు ఆర్థిక శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం కొనసాగనుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వనరులు, సంక్షేమ పథకాలపై ప్రధానంగా చర్చ జరుగనుంది.
నేడు తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. నిజామాబాద్లో బీజేపీ నిర్వహించే సభకు ఇందూరు జన గర్జన సభగా నామకరణం చేశారు. 8021 కోట్ల రూపాయల ప్రాజెక్టులను శంకుస్థాపన చేసి వాటిని ఆయన జాతికి అంకితం చేయనున్నారు. రామగుండంలోని NTPCలో 6వేల కోట్ల రూపాయలతో నిర్మించిన 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ను తెలంగాణ ప్రజలకు ప్రధాని అంకితం ఇవ్వనున్నారు. ఈ ప్లాంటులో ఉత్పత్తయ్యే విద్యుత్తులో 85 శాతం (680 మెగావాట్లు) తెలంగాణలోనే వినియోగించేలా నిర్మాణం చేశారు.…
కారల్ మార్క్స్, మహాత్మ గాంధీ సిద్ధాంతాలు చదివి సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని నేను అనను అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. కానీ వారి స్ఫూర్తిని ముందుకు తీసుకుని జగన్ వెళుతున్నారు అనేది మాత్రం నేను చెబుతానంటూ సజ్జల అన్నారు.
నేడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సత్యాగ్రహ దీక్ష చేయనున్నారు. గాంధీ జయంతిని పురస్కారించుకుని స్కిల్ స్కామ్ అక్రమ అరెస్టులో న్యాయం కోరుతూ దీక్ష చేయనున్నారు. సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబు అరెస్టయిన విషయం తెలిసిందే. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆయన సతీమణి నారా భువనేశ్వరి ‘సత్యమేవ జయతే’ పేరుతో నిరహార దీక్ష చేయనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం…
నేటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4వ విడత వారాహియాత్ర ఆరంభం కానుంది. కృష్ణా జిల్లా నుంచి వారాహియాత్ర ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డ బహిరంగసభతో పవన్ వారాహియాత్ర ఆరంభం అవుతుంది. జనసేన, టీడీపీ, బీజేపీ కలయికతో వారాహియాత్ర జరగనుంది. నేడు తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30కి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రధాని రానున్నారు. మహబూబ్నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంబోత్సవాలు చేయనున్నారు. ఆపై మహబూబ్నగర్లో ర్యాలీలో ప్రధాని పాల్గొననున్నారు.…