నేడు జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8 లక్షల 9 వేల 39 మంది విద్యార్థులకు 584 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
Medical Seats: తెలంగాణలోని మెడికల్ కాలేజీల్లో రాష్ట్ర విద్యార్థులకు రిజర్వేషన్లపై హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. 2014 జూన్ 2 తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో పోటీ అథారిటీ కోటా సీట్లలో 100 శాతం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే కేటాయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది.
మణిపూర్‌లో చిక్కుకున్న ఏపీ విద్యార్ధులను సురక్షితంగా స్వస్ధలాలకు పంపించేందుకు మరింత ముమ్మరంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. మణిపూర్‌లోని తెలుగు విద్యార్ధులున్న కాలేజీల్లో ఒక్కో విద్యార్థిని నోడల్ పాయింట్‌గా ఎంపిక చేసి, మిగిలిన ఏపీ విద్యార్థుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.
మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండ నేపథ్యంలో ఎన్ఐటీలలో చదువుతున్న రాష్ట్ర విద్యార్థులు వచ్చేస్తామన్నారని.. ఈ విషయమై ముఖ్యమంత్రితో మేమంతా సంప్రదింపులు చేస్తూ.. రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు తగు చర్యలు చేపడుతున్నామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఉక్రెయిన్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో చిక్కుకున్నారు.. ఓ వైపు యుద్ధం జరుగుతుండడంతో వారి భద్రతపై కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. అయితే, కేంద్రం సహకారంతో వారిని స్వరాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం.. ఇప్పటి వరకు ఉక్రెయినులో
ఏపీలో విద్యాకానుక లబ్ధిదారులకు శుభవార్త. వచ్చే ఏడాది నుంచి స్పోర్ట్స్ షూతో పాటు స్పోర్ట్స్ డ్రస్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాడు-నేడు, ఫౌండేషన్ స్కూళ్లపై జరిగిన సమీక్షలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం సూచించిన నూతన విద్యా విధానాన్ని అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్�