Jagananna Vidya Deevena: నేడు జగనన్న జగనన్న విద్యా దీవెన పథకం నిధుల విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP CM YS Jagan: నేడు జగనన్న విద్యా దీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ లో భాగంగా 2023–24 విద్యా సంవత్సరంలో జూలై–సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన 8 లక్షల 9 వేల 39 మంది విద్యార్థులకు 584 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం జమ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఇవాళ జరిగే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి ఈ మొత్తాన్ని లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయనున్నారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- Trump: నోబెల్ గౌరవాన్ని తగ్గించారు.. నవీ పిళ్లైకు శాంతి బహుమతి ఇవ్వడంపై ట్రంప్ ఆక్షేపణ
- CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్డౌన్!
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
- CJP Protest: ‘ఈగను చంపేందుకు సుత్తి వద్దు’.. సీజేపీ నిరసన వేళ సుప్రీం కీలక వ్యాఖ్యలు.!
ఈ మొత్తంతో కలిపి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద సీఎం జగన్ సర్కార్ ఇప్పటి వరకు 18,576 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. గత ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఖర్చు చేసిన మొత్తం కంటే రూ.6,435 కోట్లు అధికంగా ఉంది. అయితే, పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలనే లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివేవారు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంతమందికీ ఇచ్చేలా తల్లులు–విద్యార్థుల జాయింట్ అకౌంట్ లో నేరుగా ఏపీ సర్కార్ జమ చేస్తుంది.
Read Also: Mahalakshmi Stotram: చేస్తే కోరికలన్నీ తీరాలంటే.. ఈ స్తోత్ర పారాయణం చేయండి
అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రతి విద్యా సంవత్సరంలో రెండు వాయిదాలలో ఐటీఐ స్టూడెంట్స్ కు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు 15 వేల రూపాయలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే వారికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయాన్ని జగన్ ప్రభుత్వం అందిస్తోంది. అదే విధంగా ఫైనల్ ఎక్సామ్స్ రాసిన.. తుది సంవత్సరం ముగుస్తున్న విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో మే 2023–ఆగస్ట్ 2023లలో 2 లక్షల 648 మంది విద్యార్థులకు మేలు చేసేలా 185.85 కోట్ల రూపాయలను సీఎం వైఎస్ జగన్ రిలీజ్ చేశారు.
Read Also: Pakistan : పాకిస్థాన్ ఆర్థిక నమూనా విఫలం.. మెరుగుపరచకపోతే అంతే అంటున్న వరల్డ్ బ్యాంక్
ఇక, ఫైనల్ పరీక్షలు ఇటీవలే ముగిసిన, పరీక్షలకు సన్నద్ధం అవుతున్న 59 వేల 724 ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కు మాత్రమే ప్రస్తుతం జగనన్న విద్యా దీవెన నిధులను విడుదల చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఈ 55 నెలల కాలంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యారంగంపై అక్షరాలా 73 వేల 417 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. జగనన్న విద్యా దీవెనకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం జగనన్నకు చెబుదాం–1902 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ఏపీ ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
తాజావార్తలు
-
Trump: నోబెల్ గౌరవాన్ని తగ్గించారు.. నవీ పిళ్లైకు శాంతి బహుమతి ఇవ్వడంపై ట్రంప్ ఆక్షేపణ
-
RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు