పార్లమెంట్‌లో ఎంపీలకు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఇచ్చినట్టుగానే.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీ ఏడాది ఉత్తమ లెజిస్లేటర్ అవార్డు కూడా ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది రాష్ట్ర ప్రభుత్వం.. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ 2025-26 సమావేశాల నుంచి వచ్చే ఏడాది బడ్జెట్ సమావేశాల వరకు సభలో సభ్యుల పనితీరును పరిగణనలోకి తీసుకుని.. ఉత్తమ లెజిస్లేటర్ అవార్డుకు ఎంపిక చేయబోతున్నారు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి.. అసెంబ్లీ సమావేశాలకు కావాల్సిన సమాచారంతో సిద్ధంగా ఉండాలని అధికారులను ప్రభుత్వం అదేశించింది.. అసెంబ్లీ సమావేశాలను 20 రోజులు పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.. మరోవైపు ఈ నెల 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో ఈ శిక్షణా తరగతులు జరగనున్నాయి.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, సభ్యులు విధులు, సభలో సభ్యుల నడుచుకునే తీరు వంటి అంశాలపై సభ్యులకు…
ఇక నుంచి ఆంధ్రప్రదేశ్‌లో “కాగిత రహిత” (పేపర్ లెస్) శాసన వ్యవస్థ అమలు చేయనున్నట్టు వెల్లడించారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు.. ఈ మేరకు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ అడిషనల్ కార్యదర్శి సత్య ప్రకాశ్, ఏపీ శాసన సభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, ఉప సభాపతి రఘురామకృష్ణ రాజు, శాసన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు సమక్షంలో ఒప్పందంపై ఉన్నతాధికారులు సంతకాలు చేశారు..
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి సెటైర్లు విసిరారు. తనకు నమస్కారం పెట్టేందుకు ఇష్టం లేకనే జగన్ అసెంబ్లీలోకి రావడం లేదని అన్నారు.
Anakapalli Dist: అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఇంటి ఇలవేల్పు ఆలయంలో బంగారు ఆభరణాలు మాయం అయ్యాయి. మరిడి మహా లక్ష్మీ అమ్మవారి బంగారు హారం స్థానంలో గిల్టు నగను దేవాదాయశాఖ అధికారులు గుర్తించారు.