AP Budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి.. అసెంబ్లీ సమావేశాలకు కావాల్సిన సమాచారంతో సిద్ధంగా ఉండాలని అధికారులను ప్రభుత్వం అదేశించింది.. అసెంబ్లీ సమావేశాలను 20 రోజులు పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది.. అయితే, అసెంబ్లీ సమావేశాలు తొలి రోజే బీఏసీ సమావేశం నిర్వహించి దానిలో సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి.. సభలో చర్చించాల్సిన అజెండాలకు కూడా ఫైనల్ చేయనున్నారు.. ఇప్పటికే ఆర్ధిక శాఖ అధికారులు 2025 – 26 ఆర్ధిక బడ్జెట్ కేటాయింపులకు సంబందిచిన అవసరాల మేరకు కేటాయింపులపై చర్చించారు.. ఇప్పటికే కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టడంతో.. ఏపీ బడ్జెట్ లో కేటాయింపులపై స్పష్టత వచ్చింది.. ఈ బడ్జెట్ లో మూడు కీలకమైన సూపర్ సిక్స్ పథకాలకు నిధులు కేటాయింపులతో పాటు.. సంక్షేమం – అభివృద్దికి సమప్రాధన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది..
ఈ నెల 28వ తేదీన లేదా వచ్చే నెల 3వ తేదీన ఏపీ బడ్జెట్ ప్రవేశ పెట్టాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం.. 26న శివరాత్రి.. 27న ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి. దీంతో 28న బడ్జెట్ ప్రవేశ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.. ఇదే క్రమంలో ఈ సారి అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన సభ్యుల సంఖ్య ఎక్కువ ఉండటంతో.. కొత్తగా ఎంపికైన శాసన సభ్యులకు అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అవగాహన తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు.. ఈ నెల 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో ఈ శిక్షణా తరగతులు జరగనున్నాయి.. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, సభ్యులు విధులు, సభలో సభ్యుల నడుచుకునే తీరు వంటి అంశాలపై సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నారు.. ఈ శిక్షణా తరగతులను ప్రారంభించేలా లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ను ముఖ్య అతిధిగా అహ్వానించనున్నారు అసెంబ్లీ స్పీకర్.. రెండో రోజు మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు కూడా ఈ శిక్షణా తరగతులకు హాజరుకానున్నారు..