కేఏ పాల్.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడైన ఆయన తెలుగు రాష్ట్రాల్లో సంచలన కామెంట్లకు కేరాఫ్ అడ్రస్. తాజాగా ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్ కు బంపర్ ఆఫర్ ప్రకటించారు. పవన్ తన జనసేన పార్టీని వదిలి ప్రజాశాంతి పార్టీలో చేరితే ఎమ్మెల్యేనో, ఎంపీగానో గెలిపిస్తానన్నారు. గెలిపించలేకపోతే రూ.1000 కోట్ల నజారానా ఇస్తానన్నారు.
పవన్ సొంతంగా పోటీ చేసినా మరే ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసినా గెలవడని కేఏ పాల్ తేల్చిచెప్పారు. పవన్ బీజేపీతో పొత్తులో ఉండి బైబిల్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని కేఏ పాల్ అన్నారు. 42 ఎంపీ సీట్లు తానే గెలుస్తానని, హైదరాబాద్ తప్ప అన్నీ తమ పార్టీకే వస్తాయని ఆమధ్య ప్రకటించారు పాల్. అంతేకాదు, దేశానికి ప్రధానమంత్రినైపోతానని ఏవేవో కామెంట్లు చేస్తున్నాడాయన.
తెలుగు రాష్ట్రాల్లో అన్ని సీట్లూ గెలిచేసి, ఇక్కడ ముఖ్య మంత్రి పదవుల్ని పంచేస్తానని కేఏ పాల్ చెబుతున్నాడు. అందులో ఓ పదవి పవన్ కళ్యాణ్‌కి ఇచ్చేస్తాడట. అంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్‌ని కేఏ పాల్ చేసేస్తాడట. సో, పవన్ కళ్యాణ్ అభిమానులంతా ప్రజాశాంతి పార్టీకి ఓటెయ్యాలంటున్నాడు. అసలే పొత్తుల గురించి ఆప్షన్లు ఇస్తున్న పవన్ కళ్యాణ్ కి, ఆయన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న జనసైనికులకు షాకింగ్ ట్రీట్ మంట్ ఇస్తున్నాడు ప్రజాశాంతి అధినేత కేఏ పాల్. ప్రజాశాంతి పార్టీ తరఫున అనేక స్థానాల్లో పోటీచేసి రెండంకెల ఓట్లు కూడా సాధించలేని పాల్… ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని సీఎంని చేస్తానని కాసేపు, ఎంపీని చేస్తానని మరో సారి కాకమ్మ కబుర్లు చెప్పడంపై జనసేన అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు.
CM Jagan: రైతన్నలకు ప్రతి అడుగులో తోడుగా నేనుంటా