బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్‌కు చేరుకున్నారు. రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించనున్న ఆయన.. గవ్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. తొలుత విజయవాడ, రాజమహేంద్రవరంలోని బీజేపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం సిద్దార్ధ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయనున్న బీజేపీ శక్తి కేంద్ర ప్రముఖుల సమ్మేళనంలో ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో పాలు పంచుకోనున్నారు. ఆ వెంటనే ఐదున్నర గంటలకు వెన్యూ వేదికగా వివిధ రంగాలకు చెందిన మేధావులతో సమావేశం కానున్నారు.
జేపీ నడ్డా ఏపీకి విచ్చేసిన సందర్భంగా.. సోము వీర్రాజు సభలో మాట్లాడుతూ ‘ఆయన పర్యటన ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది’ అని అన్నారు. రెండు రోజుల పాటు ఏపీలో నడ్డా పర్యటించడం కీలకమైన అంశమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నో శక్తి కేంద్రాలున్నాయని చెప్పిన ఆయన.. ప్రజా వ్యతిరేక చర్యల మీద రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడేందుకు తోడ్పడుతాయని అన్నారు. కుటుంబ రాజకీయాలకు స్వస్తి పలికే దిశగా ఈ శక్తి కేంద్రాలు పని చేస్తాయన్నారు. ప్రధాని మోదీ కారణంగానే ఈ రాష్ట్రంలో స్కీమ్స్ అమలు అవుతున్నాయని, కరోనా నుంచి బయటపడ్డామని తెలిపారు. బీజేపీ చేపడుతోన్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు కొన్ని రాజకీయ శక్తులు అరాచక రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.