Pawan Kalyan: అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన పీఏసీ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. విశాఖ కేంద్రంగా అధికార పార్టీ వైసీపీ విధ్వంసం చేయాలని చూస్తోందని ఆరోపించారు. అక్కడి ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఘర్షణలు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. వివాదాలు సృష్టించి కల్లోలాలు రేపాలని ప్రయత్నాలు మొదలుపెట్టిందని పవన్ విమర్శలు చేశారు. ఇందులో భాగంగానే ఈనెల 15న జరిగిన జనసేన జనవాణి…
Perni Nani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఏ చిన్న ప్రాంతీయ పార్టీ అయినా, జాతీయ పార్టీ అయినా రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరిగినప్పుడు ప్రజలకు మేలు చేసే పనులపై మాట్లాడటం సహజంగా జరుగుతుందని.. కానీ కొండను తవ్వి ఎలుకను పట్టిన విధంగా ఈరోజు జనసేన పీఏసీ సమావేశం జరిగిందని పేర్ని నాని ఆరోపించారు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జగనన్న కాలనీలు…
మూడు రాజధానుల చుట్టే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఏపీ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని రైతులు పాదయాత్ర చేపట్టారు. మూడు రాజధానులకే మా మద్దతు అని వైసీపీ చెబుతుంది.
Pawan Kalyan: ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో వైసీపీ మంత్రులపై దాడి చేశారన్న ఆరోపణలతో 9 మంది జనసేన నేతలను పోలీసులను అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో స్థానిక కోర్టు వారికి బెయిల్ నిరాకరించగా.. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పార్టీ తమ నేతలకు బెయిల్ వచ్చేలా చర్యలు తీసుకుంది. ఈ మేరకు జైలు నుంచి విడుదలైన తమ పార్టీ నేతలను శనివారం మంగళగిరిలోని జనసేన…
Kottu Satyanarayana: జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి కొట్టు సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ వైసీపీలోని కాపు వర్గీయులను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ చర్యలతోనే కాపు సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని మంత్రి కొట్టు సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలో రాజమండ్రిలో ఈ అంశంపై కాపునేతలంతా సమావేశమై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కాపులపై పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై,…