Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 13న విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. వైసీపీ ప్రభుత్వం ‘పేదలందరికీ ఇళ్లు’ పథకంలో 28 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ క్షేత్ర స్థాయిలో పేదలకు ఇళ్లు దక్కని పరిస్థితి నెలకొందని.. ఈ నేపథ్యంలో జగనన్న కాలనీలు పేరిట జరిగిన అక్రమాలు, పేద లబ్ధిదారులను వంచించిన తీరును ప్రజలందరికీ తెలియచెప్పేలా జనసేన పార్టీ ‘జగనన్న ఇళ్లు –…
Vishnu Vardhan Reddy: ప్రధాని మోదీ విశాఖ పర్యటన నేపథ్యంలో బీజేపీ కీలక నేతలందరూ విశాఖలోనే మకాం వేశారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు విష్ణువర్ధన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ లైన్, జనసేన లైన్ ఒక్కటేనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తాము సమర్థిస్తున్నామని విష్ణువర్ధన్రెడ్డి తెలిపారు. వైసీపీ వ్యతిరేక ఓటు టీడీపీకి వెళ్లకుండా చూసుకోవడమే బీజేపీ-జనసేన ముందున్న ఉమ్మడి లక్ష్యమని పేర్కొన్నారు.…
Andhra Pradesh: ఏపీలోని జగన్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ముస్లిం దూదేకులు, మోహతార్ ముస్లింలకు కూడా వైఎస్ఆర్ షాదీ తోఫా పథకం వర్తిస్తుందని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది. వైఎస్ఆర్ షాదీ తోఫా పథకానికి ముస్లిం దూదేకులు, మెహతార్ ముస్లింలు అర్హులేనని మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఎండీ ఇంతియాజ్ వెల్లడించారు. ఈ మేరకు అన్ని జిల్లాల మైనారిటీ, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా…
Vishakapatnam: విశాఖ భూముల అంశంపై కొన్నిరోజులుగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రెండు రోజుల కిందట వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగు దొంగల పార్టీ కబ్జాకోరులు, భూబకాసురులైన గంజాయి పాత్రుడు, పీలా గోవిందు, బండారు, గీతం భరత్, వెలగపూడి రాము ఆక్రమించిన భూముల్ని కక్కించి ప్రభుత్వానికి అప్పగిస్తుంటే అడ్డగోలు బాగోతాలు, వాదనలకు దిగారని.. ఈ ద్రోహుల నుంచి 5 వేల కోట్ల…
Dharmana Prasad Rao: విశాఖ రాజధాని అంశంపై మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సంస్కరణలు చేసే వాళ్లపై వ్యతిరేకత ఎక్కువగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సీఎం జగన్ కూడా సంస్కరణలు ప్రవేశపెడుతున్నారని అందుకే ఆయనపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని ధర్మాన తెలిపారు. సంస్కరణలకు ముందే ఫలితాలు రావని.. అందుకే ప్రజల ఆమోదం ఉండదన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందంటే దానికి కారణం…