Jogi Ramesh: టీడీపీ, జనసేన పార్టీలపై మంత్రి జోగి రమేష్ తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ పత్తిత్తులు, వృద్ధ సైకో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్రలో ఓ అచ్చోసిన ఆంబోతు, ఓ నికృష్ట వెధవ, పిల్ల సైకో, ప్యాకేజీ సైకో ఎలా మాట్లాడారో అందరూ చూశారని.. నిండు సభలో జగన్‌ను బోండా ఉమ పాతరేస్తా అన్నాడని మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ అని అభివర్ణించారు. టీడీపీ తెలుగు వెన్నుపోటు పార్టీ కాదా అని నిలదీశారు. ముఖ్యమంత్రి జగన్ ఒక మాట చెప్పగానే అంత పొడుచుకుని వచ్చిందా అన్నారు. ఎన్టీఆర్‌ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచింది నిజం కాదా అన్నారు. అధికారం కోసం చంద్రబాబు ఇంతగా దిగజారాలా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు సైకో మాటలు, సైకో భాష వాడతారని చెప్పారు.
Read Also: APSRTC: ఏపీఎస్ఆర్టీసీ కొత్త నాన్ ఏసీ స్లీపర్ బస్సు చూశారా?
టీడీపీ సచ్చిపోయిందని ఆ పార్టీ సమీక్షల్లోనే నేతలు చెబుతున్నారని.. జనం చెప్పుతో కొడితే 23 సీట్లకు పరిమితం అయ్యాం అని చంద్రబాబుకు చెబుతున్నారని మంత్రి జోగి రమేష్ తెలిపారు. చంద్రబాబు బట్టలూడదీసి వైసీపీ నేతలనే కొట్టిస్తాడట.. ఈ వయసులో చంద్రబాబు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి అని ప్రశ్నించారు. లోక జ్ఞానం లేని పప్పు జగన్‌పై కారు కూతలు కూస్తాడని.. ప్యాకేజీ కళ్యాణ్ పిచ్చి కుక్కలా మాట్లాడతాడని.. అతడు ప్యాకేజీ సైకో అని జోగి రమేష్ విమర్శలు చేశారు. చెప్పు తీసుకుని కొడతా అంటాడని.. అర్థరాత్రి సంచరించే వాళ్ళు, పిక్ పాకెటర్లకు లీడర్ పవన్ కళ్యాణ్ అని ఎద్దేవా చేశారు. అందుకే జనసేన పార్టీ సైకోసేన పార్టీ అన్నారు. రాష్ట్రానికి విజిటర్‌గా వచ్చి కేకలేసి, రంకెలేసి, తొడలు కొట్టి వెళ్లిపోతాడని.. పవన్ కళ్యాణ్‌ను చూసి ఇక్కడ ఉండే సైకో సేన రౌడీల్లా, గూండాల్లాగా తిరుగుతుంటారని మంత్రి జోగి రమేష్ ఆరోపించారు.
Read Also: Power Star: బాస్ పార్టీ సాంగ్ చూసేసిన పవన్ కళ్యాణ్!