Nadendla Manohar: ఏపీ సీఎం జగన్‌పై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీని రౌడీసేననగా సంభోదిస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. జనసేన ఎందుకు రౌడీసేన సీఎం జగన్ గారూ అంటూ ఆయన పలు ప్రశ్నలు సంధించారు. సీఎం జగన్ సొంత జిల్లాలో వరద బాధితులను గాలికొదిలేసిన వాస్తవాన్ని ప్రపంచానికి చూపినందుకా అని నిలదీశారు. ఆడబిడ్డలకు రక్షణ లేదని గొంతెత్తినందుకా అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం రోడ్డున పడేసిన భవన నిర్మాణ కార్మికుల కోసం డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినందుకా అని సూటి ప్రశ్న వేశారు. మత్స్యకారులకు మీరు చేసిన మోసాన్ని గుర్తు చేసినందుకా అంటూ నాదెండ్ల మనోహర్ ట్విటర్ ద్వారా ప్రశ్నల వర్షం కురిపించారు.
ఏపీ ప్రభుత్వం అసమర్థత వల్ల ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు రూ.లక్ష చొప్పున జనసేన పార్టీ ఆర్ధిక సహాయం చేస్తున్నందుకా అని సీఎం జగన్‌ను నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. నిరంతరం ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యలపై పోరాడుతున్న జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్‌ను, వీర మహిళలను, జన సైనికులను, జనసేన పార్టీని కించపరుస్తూ సీఎం జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఆయనలో పేరుకున్న అసహనాన్ని, ఆందోళనను చెబుతున్నాయని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.
సీఎం శ్రీ జగన్ రెడ్డిలో అసహనం… ఆందోళన కనిపిస్తున్నాయి – JanaSena Party PAC Chairman Shri @mnadendla pic.twitter.com/PJarLXmplp
— JanaSena Party (@JanaSenaParty) November 21, 2022
కాగా ఈరోజు మత్స్యకార దినోత్సవం సందర్భంగా ప్రజలకు జనసేన అధినేత వపన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో నేటికీ మత్స్యకారులకు సరైన వసతులు లేవని, సముద్రంలో వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మత్స్యకారులకు రూ.10లక్షలు ఇస్తామనే హామీ నేటికీ అమలు కావడం లేదన్నారు. వారికి విద్య, వైద్య వసతులు అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. జనసేన మత్స్యకారులకు ఎల్లవేళలా అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
మత్స్యకారుల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం – JanaSena Chief Shri @PawanKalyan #WorldFisheriesDay pic.twitter.com/kkVGWlq61t
— JanaSena Party (@JanaSenaParty) November 21, 2022