Gudivada Amarnath: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ 175 నియోజకవర్గాల పేర్లు చెప్పగలిగితే తాను అన్నీ వదులుకుని ఎక్కడికైనా వెళ్లిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు సవాల్ విసిరారు. జగన్ సీఎం కాడని గత ఎన్నికల ముందు చెప్పాడని.. కానీ ఏమైందో అందరూ చూశారని.. ఇప్పుడు కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవదని చెప్తున్నాడని.. మళ్లీ వైసీపీ గెలిచి తీరుతుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ జోస్యం చెప్పారు.…
Sajjala Ramakrishna Reddy: మూడు రాజధానుల విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులపై ప్రభుత్వ నిర్ణయం సహజ న్యాయానికి అనుగుణంగా, ప్రజల ఆకాంక్ష మేరకు ఉందన్నారు. మూడు రాజధానులపై గతంలో హైకోర్టు నిర్ణయాలు, ఆదేశాలు అందుకు భిన్నంగా వచ్చాయన్నారు. అయితే సుప్రీం కోర్టు స్టే ఇచ్చిందని.. ప్రభుత్వానికి ప్రజల తీర్పు ద్వారా సంక్రమించిన అధికారం ఉందని సజ్జల చెప్పారు. దానికి భిన్నంగా హైకోర్టు తీర్పు ఉందని…
Perni Nani: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. ప్రతి ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ స్లోగన్ ఒకటే జగన్‌ను గెలవనీయం అంటాడని.. మమ్మల్ని గెలిపించేది, ఓడించేది ప్రజలు అని.. అసలు పవన్ కళ్యాణ్ ఎవరు అని ప్రశ్నించారు. చంద్రబాబు కళ్లల్లో ఆనందం కోసమే తమపై పవన్ విమర్శలు చేశారని మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యానించారు. జగన్‌పై విద్వేషం తప్ప పవన్ ప్రసంగంలో ఏమీ లేదని ఎద్దేవా…
Pawan Kalyan: అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను అన్నమయ్య డ్యామ్ బాధితులు కలిశారు. ఈ సందర్భంగా లష్కర్ రామయ్యకు పవన్ కళ్యాణ్ రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. అన్నమయ్య డ్యామ్ బాధిత యువకుడు వంశీకి రూ.50 వేలు ఆర్ధిక సాయం అందించారు. అనంతరం జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని ఆరోపించారు. ఈ అంశంపై జనసేన పార్టీ ముందుగా…
Jogi Ramesh: ఆదివారం నాడు వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసివచ్చినా వైసీపీ కంచుకోటను ఇంచుకూడ కదలించలేరని ఆయన వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ అజ్ఞాని అని ఎద్దేవా చేశారు. జనసేనను సైకో సేనగా మంత్రి జోగి రమేష్ అభివర్ణించారు. పవన్ లాంటి సైకోగాళ్లు నెలకోసారి వచ్చి ప్రజలను రెచ్చగొట్టి వెళ్తుంటారని మండిపడ్డారు. ఈ సైకోలు రాత్రిపూట సంచరించే రౌడీలు, గుండాలు,…
Bhanu Prakash Reddy: తిరుపతిలో బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ను జగన్ ప్రభుత్వం క్రీస్తుప్రదేశ్‌గా మార్చేస్తున్నారని సోషల్ మీడియాలో మెసేజ్‌లు సర్క్యులేట్ అవుతున్నాయని ఆయన ఆరోపించారు. ట్రాఫిక్ పోలీసులు విధించిన జరిమానా రిసిప్ట్‌పై క్రైస్తవ ప్రచారం చేయడం దారుణమని భానుప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీలో ఉద్దేశపూర్వకంగా హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నా సీఎం జగన్ మౌనమునిలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో దేవాలయాలు దూప దీప…