Jogi Ramesh: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ త్వరలో బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఈ మేరకు ఓ వాహనాన్ని సిద్ధం చేయించారు. ఈ వాహనానికి వారాహి అని నామకరణం చేశారు. అయితే వారాహి రంగుపై విమర్శలు చెలరేగాయి. పవన్ తయారుచేయించుకున్న బస్సు మిలిటరీ వాహనం తరహాలో ఆలివ్ గ్రీన్ రంగులో ఉండడం పట్ల వైసీపీ నేతలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ప్రైవేటు వాహనాలకు మిలిటరీ వాహనాల రంగు వేయడం నిబంధనలకు విరుద్ధమని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్…
Congress Party: రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలా పడిపోయింది. గత 9 ఏళ్లుగా ఆ పార్టీ తరఫున అసెంబ్లీలో ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. దాదాపుగా సీనియర్ నేతలందరూ ఇతర పార్టీలకు వలస వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఏపీసీసీకి కొత్త చీఫ్‌ను అధిష్టానం నియమించింది. తాజాగా ఏపీసీసీ నూతన అధ్యక్షుడిగా శైలజానాథ్ నుంచి గిడుగు రుద్రరాజు శుక్రవారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రుద్రరాజును కలిసి అమరావతి రైతులు అభినందనలు తెలిపారు.…
Pawan Kalyan: జనసేనకు చెందిన వారాహి వాహనంపై వైసీపీ, జనసేన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే వైసీపీ నేతల ఆరోపణలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ల రూపంలో కౌంటర్లు ఇస్తున్నారు. ఈ మేరకు కారు టు కట్‌డ్రాయర్ అంటూ ఓ ట్వీట్ చేశారు. అందులో టిక్కెట్ రేట్లు, కారు రంగులు, కూల్చడాలు లాంటి చిల్లర పనులు ఆపి ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఇప్పటికే ఏపీలో వైసీపీ నేతల లంచాలు, వేధింపుల…
Chandra Babu: గుంటూరు జిల్లా పొన్నూరు పర్యటనలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ముస్లిం మైనారిటీలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మంత్రి పదవులు పొందాలంటే 10వ తరగతి చదువు అర్హత అవసరం లేదని, ప్రభుత్వ సలహాదారులకు 10వ తరగతి అర్హత అవసరం లేదని.. దుల్హన్ పథకానికి మాత్రం 10వ తరగతి చదువుకుని ఉండాలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే దుల్హన్ పథకాన్ని తీసుకువస్తానని..…
Margani Bharat: పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ముగిసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ సమావేశానికి వైసీపీ తరఫున రాజమండ్రి ఎంపీ, చీఫ్ విప్ మార్గాని భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాల్లో విభజన చట్టంలోని పెండింగ్ అంశాల అమలే తమ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. పెరుగుతున్న ధరలను నియంత్రించాలని కేంద్రాన్ని కోరామన్నారు.…