Margani Bharat: పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్‌లపై ప్రత్యేక చర్చ జరగాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Margani Bharat: పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ముగిసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ సమావేశానికి వైసీపీ తరఫున రాజమండ్రి ఎంపీ, చీఫ్ విప్ మార్గాని భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాల్లో విభజన చట్టంలోని పెండింగ్ అంశాల అమలే తమ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. పెరుగుతున్న ధరలను నియంత్రించాలని కేంద్రాన్ని కోరామన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్‌లు కల్పించాలని మార్గాని భరత్ కోరారు. జగన్ ప్రభుత్వం బీసీలకు అన్ని స్థాయిలో 50శాతానికి పైగా పదవులు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు.
Read Also: Vamsiram Builders: వంశీరాం బిల్డర్స్ లో హవాలా లావాదేవీలపై IT శాఖ ఆరా
Also Read
అటు బీసీ రిజర్వేషన్‌ల అంశంపై పార్లమెంట్‌లో ప్రత్యేకంగా చర్చలు చేపట్టాలని మార్గాని భరత్ అన్నారు. బీసీ జనగణన, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబు కారణమన్నారు. విభజన హామీల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలని ఎంపీ భరత్ అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!