Pawan Kalyan: ఎన్నికల ప్రచార యుద్ధానికి పవన్ వాహనం సిద్ధం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘Varahi’ is ready for Election Battle! pic.twitter.com/LygtMrp95N
— Pawan Kalyan (@PawanKalyan) December 7, 2022
Also Read
రాబోయే ఎన్నికలకు అప్పుడే అస్త్రశస్త్రాలు రెడీ అవుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతున్నారు పవన్. వారాహి పేరుతో పవన్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వాహనం సిద్దం చేసింది జనసేన. యుద్ద ట్యాంక్ లుక్ తో ఉన్న పవన్ ప్రత్యేక వాహనం వారాహి స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. వారాహి విజువల్స్ స్వయంగా ట్వీట్ చేశారు పవన్ కళ్యాణ్.ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. పవన్ తన రథాన్ని రెడీ చేయించారు. మిలటరీ ట్రక్ తరహాలో ఓ వాహనాన్ని రెడీ చేయించుకుంటున్నారని ముందుగానే వార్తలు వచ్చాయి. అవి నిజమని పవన్ ట్వీట్ ద్వారా బహిర్గతం అయ్యాయి. వారాహి వాహనం ఫోటోలను పవన్ షేర్ చేసారు. ఫొటోలు షేర్ చేయడం సంగతి సరే, ఈ సందర్భంగా విడుదల చేసిన చిన్న వీడియో మాత్రం పవన్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది. ఈ రథానికి ‘వారాహి’ అని పేరు పెట్టారు. యుద్దానికి వారాహి సిద్దం అనే టైటిల్ లో వీడియో వదిలారు.
కావాలని తన బాడీ గార్డ్ లను మిలటరీ జవాన్లు మాదిరిగా చూపించడం విశేషం. మిలటరీ ట్రక్, దానికి ఇరు వైపులా సైనికుల మాదిరిగా గార్డులు కవాతు చేస్తున్నట్లు ఓ వీడియో తయారు చేసి వదిలారు. జనసేన సైనికులు ఈవీడియో తయారుకోసం ఎంతగా శ్రమపడ్డారో అర్థం చేసుకోవచ్చు. పైగా మిలటరీ కలరింగ్ రావడానికి ఇవి మాత్రం సరిపోవు అని సెక్యూరిటీ గార్డ్ లకు పంజాబీల మాదిరిగా గెటప్ లు వేయడం గమనించవచ్చు. సినిమాల్లో లాగే పవన్ కు గబ్బర్ సింగ్ తరహాలో అనేక ఫాంటసీలు వున్నాయి. తుపాకులు. మిలటరీ. నక్సల్ యూనిఫారమ్..ఇలా చాలా ఫాంటసీలు వున్నాయి. రాబోయే ఎన్నికలు మాత్రం మామూలుగా వుండవనే సంకేతం ఈ వాహనం ద్వారా తెలియచేశారు పవన్. ఈ వాహనంపై ఆయన అభిమానులు ఖుషీ అవుతుంటే.. విపక్షాలు మాత్రం ఎలా స్పందిస్తాయో చూడాలి.

తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!