Margani Bharat: పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ముగిసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ సమావేశానికి వైసీపీ తరఫున రాజమండ్రి ఎంపీ, చీఫ్ విప్ మార్గాని భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాల్లో విభజన చట్టంలోని పెండింగ్ అంశాల అమలే తమ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. పెరుగుతున్న ధరలను నియంత్రించాలని కేంద్రాన్ని కోరామన్నారు.…
Sajjala Ramakrishna Reddy: ఏపీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తున్నామని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఓ ప్రభుత్వ విభాగంలో కొద్ది మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తూ ఆదేశాలు వచ్చాయని.. సిబ్బందిని తొలగిస్తూ అధికారులు ఆదేశాలు ఇవ్వడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారని సజ్జల తెలిపారు. ఇచ్చిన ఆదేశాలను వెంటనే ఉపసంహరింపజేయాలని సీఎం ఆదేశించారన్నారు. పంచాయతీరాజ్ డిపార్టుమెంట్లోనూ పొరుగు సేవల సిబ్బంది తొలగించారన్న అంశంపైనా విచారణ…
Nadendla Manohar: చిత్తూరు జిల్లా పుంగనూరులో పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి చేయడాన్ని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తాం.. ఎదురించి నిలబడితే ఆస్తులను ధ్వంసం చేస్తాం.. మాన, ప్రాణాలను తోడేస్తామన్న రీతిలో ఆదివారం రాత్రి పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ నేతలు ప్రవర్తించారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వెనుకబడిన వర్గానికి చెందిన రామచంద్ర యాదవ్ ఇంటిపై జరిగిన…
CPI Ramakrishna: ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. ఏపీలో జగన్ పాలనలో అన్నీ రివర్స్లో జరుగుతున్నాయని మండిపడ్డారు. ఎక్కడైనా చిన్న పార్టీలు, ప్రతిపక్షాలు ఉద్యమించడం చూశామని.. కానీ ఏపీలో వైసీపీనే ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం దేనికి సంకేతమని సీపీఐ నేత రామకృష్ణ ప్రశ్నిస్తున్నారు. కర్నూలు వేదికగా రాయలసీమ గర్జనను వైసీపీనే ముందుండి నడిపిస్తుందని.. ఇది ప్రజలను దారుణంగా…
TDP Vs YCP: ఏపీలో టీడీపీ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బాదుడే బాదుడు తరహాలో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ అనే పేరుతో మరో కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వ్యూహాలను సిద్ధం చేసింది. ఈ మేరకు ఏలూరు జిల్లాలో బుధవారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. అయితే చంద్రబాబు పర్యటనకు ముందే వైసీపీ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. దీంతో ఏలూరు జిల్లాలో టీడీపీ, వైసీపీల మధ్య ఫ్లెక్సీ వార్ మొదలైంది. చంద్రబాబు పర్యటన సందర్భంగా…
Jagananna Vidyadeevena: ఏపీ సీఎం జగన్ నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తన పర్యటన సందర్భంగా జగనన్న విద్యాదీవెన పథకం కింద నాలుగో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఉదయం 9 గంటలకు సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి బయలుదేరి ఉదయం 9:30 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఉ.11:10 గంటలకు మదనపల్లి బీటీ కళాశాలకు…
RK Roja: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఆనం కళా కేంద్రంలో జగనన్న స్వర్ణోత్సవ సంస్కృతిక సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మన కళలను భవిష్యత్ తరాలు గుర్తుపెట్టుకునే విధంగా నాలుగు జోన్లలో జగనన్న స్వర్ణోత్సవ సంస్కృతిక సంబరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి, గుంటూరులో ఇప్పటికే ఉత్సవాలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. గడచిన 1000 సంవత్సరాలుగా గోదావరి జిల్లాలో కళలు, సంస్కృతి విరాజల్లుతున్నాయని…