Jagananna Vidyadeevena: ఏపీ సీఎం జగన్ నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తన పర్యటన సందర్భంగా జగనన్న విద్యాదీవెన పథకం కింద నాలుగో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఉదయం 9 గంటలకు సీఎం జగన్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి బయలుదేరి ఉదయం 9:30 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉ.11:10 గంటలకు మదనపల్లి బీటీ కళాశాలకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి ఉ.11:30 గంటలకు టిప్పు సుల్తాన్ మైదానంలో జరిగే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. సాయంత్రం 3:30 గంటలకు తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు.
Read Also: YS sharmila: ఇంటికి చేరుకున్న షర్మిల.. నిరాహార దీక్షను ముగించిన విజయమ్మ
కాగా మదనపల్లి పర్యటనలో జూలై-సెప్టెంబర్ 2022 త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యాదీవెన నిధులను సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తోంది. ఈ మేరకు రూ.694 కోట్ల నిధులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో సీఎం జగన్ జమ చేయనున్నారు. ఇప్పటివరకు విద్యా దీవెన కింద రూ.9,052 కోట్లు, వసతి దీవెన కింద 3,349 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ రెండు పథకాల కింద ప్రభుత్వం మొత్తంగా రూ. 12,401 కోట్లను వ్యయం చేసింది. పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదవడానికి సహకరించేలా ప్రభుత్వం ఈ రెండు పథకాలను అమలు చేస్తోంది.