ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశాఖ వేదికగా జరుగుతోన్న కాపునాడు సభ చర్చగా మారింది.. అయితే, కాపునాడు సభకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ కూడా దూరంగా ఉన్నాయి.. జనసేన పార్టీ నేతలు మాత్రం హాజరుకాబోతున్నారు. దీంతో, ఈ సభలో ఎలాంటి నిర్ణయాలు ఉంటాయన్నదానిపై ఆసక్తి నెలకొంది.. వంగవీటి మోహనరంగ పోరాటం స్ఫూర్తిగా కార్యాచరణ ప్రకటించబోతున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన కాపు ప్రతినిధులు ఈ సభకు తరలివస్తున్నారు.. రాజకీయాలకు అతీతమే అని చెప్పినప్పటికీ..…
Kodali Nani: విజయవాడలో నున్న సెంటర్లో వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్, వంగవీటి రాధా పాల్గొన్నారు. వీళ్ల ముగ్గురూ ఒకే వేదికపైకి రావడంతో రాజకీయంగా ఆసక్తి రేగింది. ఈ సందర్భంగా వంగవీటి రంగాపై మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదల కోసమే రంగా జీవించారని.. నమ్మిన సిద్దాంతం కోసం రంగా ప్రాణత్యాగం చేశారని తెలిపారు. ప్రజల గుండెల్లో రంగా ఉన్నత స్థానాన్ని సంపాదించుకున్నారని కొడాలి…
Yanamala: వైసీపీ ప్రభుత్వ పాలనపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు చేశారు. అప్పులపై అరగంటకో అబద్ధం.. గంటకో అప్పు, రోజుకో నిబంధన.. ఉల్లంఘన అనే విధంగా వైసీపీ పాలన సాగుతోందని యనమల ఆరోపించారు. అప్పులపై సీఎం జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై కాగ్ అధికారుల సమక్షంలో బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నట్లు యనమల తెలిపారు. రాజ్యంగబద్ధ సంస్థలైన కాగ్ వంటి వాటికి కూడా…
Botsa Satyanarayana: టీడీపీ అధినేత చంద్రబాబుపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు తెగ తాపత్రయ పడుతున్నాడని ఆయన ఆరోపించారు. ఆయనకు జవసత్వాలు అయిపోయాయని.. అందుకే వాటిని నిలుపుకోవడానికి పర్యటనలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. నిర్మాణాత్మకమైన అంశాలు చెబితే ప్రజలు దాని గురించి ఆలోచిస్తారని.. కానీ అసత్యాలు చెప్తే నమ్మరనే సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. రాజాం, బొబ్బిలి సభలలో చంద్రబాబు అన్నీ అసత్యాలే చెప్పారని మంత్రి బొత్స మండిపడ్డారు. బొబ్బిలి రైతు…
Chandra Babu: కడప జిల్లా కమలాపురంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు విజయనగరం జిల్లా బొబ్బిలి బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ తరహాలో తాను ఒక రాష్ట్రం ముఖ్యమని.. అధికారం ముఖ్యమని చెప్పను అని.. తనకు తెలుగు జాతి ముఖ్యమని.. తెలుగు ప్రజలు ముఖ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగు ప్రజలు ఎక్కడుంటే తాను అక్కడ ఉంటానని.. వాళ్లకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని తెలిపారు. తెలుగు జాతి…
Minister AppalaRaju: ఏపీ పశు సంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వగానే చిత్తూరు డైరీ మూతపడిందని.. అది తన ఘనతేనని చంద్రబాబు తన సక్సెస్ స్టోరీలో రాసుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో అమూల్ లీజ్ పాలసీపై అనవసరమైన రాద్దాంతం చేస్తున్నారని.. అమూల్ ద్వారా రూ.500 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి అప్పలరాజు క్లారిటీ ఇచ్చారు. తమ హయాంలో పాల రైతులు గతంలో చూడని ధరలు ఇప్పుడు…