CPI RamaKrishna: వైసీపీ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి బుగ్గన అప్పులు తెస్తెనే …జగన్ బటన్ నొక్కే దౌర్భాగ్య పరిస్థితి ఉందని రామకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక, మట్టి, మద్యం దొంగలు మాత్రమే బాగున్నారని చురకలు అంటించారు. మూడున్నరేళ్లలో రైతుకు ఉపయోగపడే ఒక్క పని కూడా జగన్ చేయలేదని విమర్శలు చేశారు. కనీసం కడపలో పిల్ల కాలువను కూడా జగన్ తవ్వలేదన్నారు. జగన్ ఎక్కడికి…
Jogi Ramesh: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి జోగి రమేష్ మరోసారి సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ వారాహి మీద కాకుండా వరాహం మీద తిరిగినా తమకు అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ అనే చవట, సన్నాసి చంద్రబాబు బూట్లు నాకుతున్నాడని ఆరోపించారు. ఎవరైనా తాను సీఎం అవుతానంటారని.. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్‌కు ధైర్యం ఉంటే 175 నియోజకవర్గాలలో పోటీ…
VijayasaiReddy: ఇటీవల టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్, కన్నడ హీరో యష్ భేటీ కావడంపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తనదైన రీతిలో సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. పప్పు పాదయాత్రకు జనాలు పోటెత్తాలంటే పాన్ ఇండియా మూవీ హీరోలను రప్పించాలంటూ చురకలు అంటించారు. ‘ఉ(య)ష్! వాళ్లు రాకపోతే? హోటళ్లు, షూటింగ్ స్పాట్లకు ఏ దిగ్గజ దర్శకుడి రిఫరెన్సుతోనో లేకేషే వెళ్లి కలవాలి. ఛార్టర్డ్ ఫ్లైట్లు, కోట్లల్లో పారితోషికం అరేంజ్ చేయాలి. ఇదీ…
Kodali Nani: ఏపీలో పల్నాడు జిల్లా మాచర్ల రాజకీయాలు కాక రేపుతున్నాయి. మాచర్లలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వైసీపీ వాళ్లే దాడి చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాచర్ల ఘటనపై మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. రాజకీయాల్లో గొడవలు సర్వసాధారణమని వ్యాఖ్యానించారు. ఇలాంటి గొడవలు మొదటిసారి కాదు.. చివరిసారి కూడా కాదన్నారు. బహిరంగ సభల్లో 75 ఏళ్ల చంద్రబాబు ప్రతిరోజూ వైసీపీ నేతలను బట్టలూడదీసి కొడతానని అంటున్నారని..…
Julakanti Brahma Reddy: పల్నాడు జిల్లా మాచర్లలో పొలిటికల్ హీట్ నెలకొంది. టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య అగ్గి రాజుకుంది. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటికి నిప్పుపెట్టడం స్థానికంగా కలకలం రేపింది. ఈ నేపథ్యంలో మాచర్ల టీడీపీ ఇంఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ.. తమ ఇళ్లను తామే తగులబెట్టుకున్నామని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా మాచర్ల మెయిన్ రోడ్డుపై ఉన్న షాపుల్లో కరపత్రాలు పంచుతున్నామని.. ఆ సమయంలో వైసీపీ నేతలు…
ChandraBabu: గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటికి గుర్తుతెలియని దుండగులు నిప్పుపెట్టారు. అయితే ఈ ఘటనను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. మాచర్ల పరిస్థితులపై గుంటూరు డీఐజీకి చంద్రబాబు ఫోన్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే పోలీసులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తక్షణమే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గూండాలకు సహకరించిన పోలీసు సిబ్బంది, అధికారులపై చర్యలు…
Clashes in Macherla: పల్నాడు జిల్లా మాచర్ల అగ్నిగుండంలా మండిపోతోంది. వైసీపీ కార్యకర్తల విధ్వంసంతో మాచర్లలో హింస పేట్రేగింది. అధికార పార్టీ కార్యకర్తలను కంట్రోల్లో పెట్టాల్సిన పోలీసులు కూడా ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపై ప్రతాపం చూపుతున్నారు. ఇప్పటికే 144 సెక్షన్ విధించిన పోలీసులు టీడీపీ నేతలను గృహనిర్బంధంలో ఉంచారు. మరోవైపు గుంటూరు జిల్లా వ్యాప్తంగా టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుతో పాటు టీడీపీ నేతలు నజీర్ అహ్మద్, కనపర్తి శ్రీనివాస్…