Harirama Jogaiah: మాజీ మంత్రి, కాపు సంక్షే సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌కు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబే కాబోయే ముఖ్యమంత్రి.. ఈ నిర్ణయంలో రెండో మాటలేదు.. “అనుభవస్తుని నాయకత్వమే ఈరాష్ట్రానికి కావాలి” అని పవన్ కళ్యాన్ అనేక సార్లు ప్రకటించారు.. కనుక అందరి మాట ఇదే అంటూ” లోకేష్ ప్రకటించేశారని ఆయన లేఖలో తెలిపారు. రాజ్యాధికారాన్ని చేపట్టే విషయంలో పవన్ వైఖరి ఏంటో స్పష్టంగా చెప్పాలంటూ జనసేనానికి చురకలంటించారు.
Read Also: Balakrishna: రంగంలోకి దిగిన బాలయ్య.. రెండు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటన
లోకేష్ ఆశిస్తున్నట్లు చంద్రబాబును పూర్తికాలం సీఎం చేయడానికి మీ ఆమోదం ఉందా అంటూ ప్రశ్నించారు. మీరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న జనసైనికుల కలలు ఏం కావాలంటూ ప్రశ్నలు గుప్పించారు. రాష్ట్రంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెండే రెండు కులాల నాయకులు రాజ్యమేలుతున్నారని.. 80శాతం జనాభా ఉన్న బడుగు బలహీన వర్గాలకు మోక్షమెప్పుడు అంటూ ఆయన లేఖ ద్వారా పవన్‌ను నిలదీశారు. మీ ద్వారా నీతివంతమైన పాలన అందిస్తారని ఆశిస్తున్న ప్రజానికానికి మీరే చెప్పే సమాధానం ఏంటని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ వైఖరి ఏంటో జనసైనికులందరికి అర్ధమయ్యేలా చెప్పాలని నిలదీశారు.