కృష్ణా జిల్లా గుడివాడ ఒకటవ వార్డులో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని.. చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారం కోసం చంద్రబాబు గాడిది కాళ్లైనా పట్టుకుంటాడంటూ ఎద్దేవా చేశారు. అధికారం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తాడని రాష్ట్రంలోని ముస్లిం, క్రిస్టియన్, హిందూ సోదరులందరికీ తెలుసు.. ఆయన వెనకాల ఉన్న తెలుగు తమ్ముళ్లకు, పదిమంది జనసైనికులకు తప్ప అంటూ విమర్శలు గుప్పించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి బస్సు యాత్రతో ప్రచారాన్ని శ్రీకారం చుడుతున్నారు. ఇందులో భాగంగానే మొదటగా వైఎస్ఆర్ జిల్లా ఇడుపులపాయ నుండి ‘మేమంతా సిద్ధం’ అనే పేరుతో ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి రెడీ అయ్యారు. ఇందులో భాగంగా మొదటిరోజు ప్రచారాన్ని కడప పార్లమెంటు నియోజకవర్గం నుండే నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. దింతో నేడు మొదటి రోజు వేంపల్లి, వీరపునాయినిపల్లి, ఎర్రగుంట్ల మీదుగా బస్సు…
నెల్లూరు లోక్సభ వైసీపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో పలువురు జన సేన నేతలు, కార్యకర్తలు వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టసభల్లో ఎక్కడా జనసేన పార్టీకి ప్రాతినిధ్యం లేదన్నారు. కేవలం చట్ట సభల్లోకి రావడానికే టీడీపీ, బీజేపీలతో పొత్తు పెట్టుకున్నారని ఆయన విమర్శలు గుప్పించారు.
ఏపీలోని గంజాయి మాఫియా మన రాష్ట్ర ప్రజలనే కాదు, పొరుగు రాష్ట్రాల వారిని కూడా ప్రమాదంలోకి నెట్టేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్లో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, జగిత్యాలలో గంజాయి ముఠా అరెస్ట్ సమయంలో వెలుగు చూసిన వాస్తవాలు నివ్వెర పరిచాయని పేర్కొ్న్నారు. గంజాయి విక్రయిస్తున్న ఈ ముఠాకి విశాఖలోని సీలేరు నుంచి గంజాయి సరఫరా కావడం ఎంతో ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. మన రాష్ట్రంలో గంజాయి అమ్మకాల గురించి పొరుగు రాష్ట్ర పోలీసులు చెపుతుంటే ఈ…
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈ క్రమంలో.. ఏలూరు ఎంపీ అభ్యర్థి ప్రకటనతో బీజేపీ, టీడీపీలో ముసలం ఏర్పడింది. టీడీపీ నేత పుట్టా మహేష్ యాదవ్ కు టికెట్ కేటాయించడంపై పార్టీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో.. టీడీపీని వీడేందుకు గోపాల్ యాదవ్ సిద్ధమయ్యారు. ఆయన ఎంపీ టికెట్ ఆశించగా నిరాశ ఎదురైంది.
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం రేణమాల గ్రామంలో వైసీపీకి చెందిన 100 కుటుంబాలు, సుమారు 500 మంది ఓటర్లు ఉదయగిరి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ సమక్షంలో మండల కన్వీనర్ ఓంకారం ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు.
ఏపీల బెజవాడ పశ్చిమ సీటు పంచాయితీ రసవత్తరంగా మారింది. ఎట్టకేలకు బెజవాడ పశ్చిమ సీటు పంచాయితీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ దగ్గరకు చేరింది. పశ్చిమ సీటు జనసేనకు ఇవ్వాలని పోతిన మహేష్ వర్గం వారం రోజులుగా వరుస ఆందోళనలు చేపడుతోంది.
ముందు మూడన్నారు…. తర్వాత రెండయ్యాయి. ఇప్పుడు ఒకటేనంటే ఎలా? మరీ ఇంత త్యాగరాజులైతే ఎలా? సర్దుకుపోవడానికి కూడా ఓ హద్దు ఉండాలి కదా… ఇదీ ఇప్పుడు జనసేన అధిష్టానాన్ని ఉద్దేశించి ఆ పార్టీ నేతలే మాట్లాడుకుంటున్న మాట. అత్యంత కీలకమైన జిల్లాలో ఒక్క సీటుకు పరిమితం అయితే పరువేం కావాలంటూ ప్రశ్నిస్తున్నారట. ఇంతకీ ఏదా జిల్లా? పార్టీ అధిష్టానం ఎందుకు కాంప్రమైజ్ అవుతోంది? ఉమ్మడి కృష్ణాజిల్లాలో జనసేన పోటీ చేసే స్థానాలపై పొలిటికల్ సర్కిల్స్లో కొత్త చర్చ…
వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఈ నెల 27వ తేదీ నుంచి ‘మేమంతా సిద్ధం’ పేరుతో బస్సుయాత్ర ద్వారా తొలి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించబోతున్నారు.