ప్రస్తుతం దేశంలో లోక్ సభ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతుండగా.. ఆంధ్రప్రదేశ్లో ఓవైపు లోక్ సభ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు, మరోవైపు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు ఒకేసారి జరగడంతో రాష్ట్రంలో రాజకీయ హీట్ మరింతగా జోరందుకుంది. ఇందులో భాగంగానే అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారాలలో పెద్ద ఎత్తున కొనసాగిస్తుంది. ఇక పార్టీల పెద్దలు రాష్ట్ర మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలను మమేకం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రలో పాల్గొంటున్నాడు. ఇక ఇందుకు సంబంధించి నేటి విశేషాలు చూస్తే..
Also Read: Odisha : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, 38 మందికి గాయాలు
రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటితో 16వ రోజైన మంగళవారం షెడ్యూల్ ను ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం సోమవారం విడుదల చేశారు. ఇక ఈ యాత్రలో భాగంగా నేడు ముఖ్యమంత్రి జగన్ సోమవారం రాత్రి బస చేసిన నారాయణపురం దగ్గర నుంచి మంగళవారం ఉదయం 9 గంటలకు బయలుదేరి.. నిడమర్రు, గణపవరం మీదుగా ఉండి చేరుకుంటారు.
Also Read: Attack on CM YS Jagan Case: సీఎం జగన్‌పై దాడి కేసు.. దర్యాప్తు ముమ్మరం..
ఇక ఉండి శివారులో సీఎం జగన్ భోజన విరామం తీసుకోనున్నారు. ఆపై అక్కడి నుంచి బయలుదేరి భీమవరం బైపాస్ రోడ్ గ్రంథి వెంకటేశ్వరరావు జూనియర్ కాలేజ్ వద్ద సాయంత్రం 3.30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని సీఎం జగన్ ప్రసంగిస్తారు. ఇక ఆ సభ తరవాత పిప్పర, పెరవలి, సిద్ధాంతం క్రాస్ మీదుగా ఈతకోట శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి ముఖ్యమంత్రి జగన్ చేరుకుంటారు.