టీడీపీలో కొత్త ట్రబుల్ షూటర్స్ దిగారా? చంద్రబాబు వాళ్ళకు స్పెషల్ టాస్క్ ఇచ్చారా? పార్టీకి సంక్లిష్టంగా ఉండే నియోజకవర్గాలనే కొత్త నేతలకు టార్గెట్‌గా పెట్టారా? తన రెగ్యులర్ స్టైల్‌కు భిన్నంగా…. ఏ నిర్ణయం తీసుకున్నా ఫర్లేదు, రిజల్ట్ ముఖ్యం అంటూ చంద్రబాబు వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేశారా? ఇంతకీ ఎవరా ట్రబుల్ షూటర్స్? ఏంటా స్టోరీ? చంద్రబాబు సొంత జిల్లా అయినా…ఉమ్మడి చిత్తూరు టీడీపీకి ఎప్పుడూ సంకటంగానే ఉంటుంది. అభ్యర్ధుల ఎంపిక, అసమ్మతిని నియంత్రించడం కత్తిమీద సాములాగే…
తాడేపల్లిగూడెం టీడీపీ - జనసేన మీటింగ్‌పై మంత్రి జోగి రమేష్ తీవ్రంగా స్పందించారు. పవన్ కళ్యాణ్ పూజకు పనికి రాని పువ్వు అని ఆయన వ్యాఖ్యానించారు. 24 సీట్లు తీసుకున్న పవన్ నిర్ణయంతో జన సైనికులు ఎంత బాధతో ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుందన్నారు.
సిద్ధం సిద్ధం అంటున్న వైఎస్ జగన్ కి 2024ఎన్నికల్లో యుద్ధం ఇద్దామంటూ జనసైనికులను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభలో ఆయన ప్రసంగించారు. ఐదేళ్ల పాలనలో యువత, రైతులు, మహిళలు, అంగన్వాడి, ఉద్యోగులు అందరినీ మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఏపీ రోడ్లు పై పాలు పోస్తే తిరిగి గిన్నెల్లో ఎత్తుకోవచ్చని, చదువుకున్న వాళ్లకు ఎక్కడపడితే అక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి అంటూ వైసీపీ నాయకులు పగటి కలల్లో ఉన్నారని పవన్…
తెలుగు జన విజయకేతన సభ ఇది అని.. తాడేపల్లిగూడెం సభ చరిత్రను తిరగరాస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం టీడీపీ-జనసేన ఉమ్మడి బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. మన పోరాటం వైసీపీ దొంగలపై అన్న ఆయన.. తాడేపల్లిగూడెం సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపిస్తుందన్నారు.
తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన కలిసి ఉమ్మడిగా నిర్వహిస్తోన్న "తెలుగు జన విజయ కేతనం జెండా" సభ ప్రారంభమైంది. వేదికపైకి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లతో పాటు ఇరు పార్టీలకు చెందిన ఐదువందల మంది నాయకులు చేరుకున్నారు.
పలనాడు జిల్లాలోని మాచర్లలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరొకసారి వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మాచర్లలోని 28వ వార్డులో పార్టీ కార్యక్రమానికి సంబంధించి ఫ్లెక్సీలు కడుతున్నారు టీడీపీ నాయకులు.
టీడీపీ-జనసేన ఉమ్మడిగా నిర్వహించబోతున్న తొలి సభకు తాడేపల్లిగూడెం వేదికగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. 6 లక్షల మంది ఈసభకు హజరవుతారనే అంచనాతో సభా ప్రాంగణాన్ని ఇరు పార్టీలు కలసి ముస్తాబు చేస్తున్నాయి. బుధవారం జరగబోయే సభకు తెలుగుజన విజయ కేతనం జెండా అనే పేరు పెట్టారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు వేదికపై నుంచి నాయకులకు, క్యాడర్‌కు దిశానిర్ధేశం చేయబోతున్నారు.
స్పీకర్ అనర్హత వేటు వేయడంపై వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. ఏడాది క్రితమే తమను వైసీపీ సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు అనర్హత వేటు వేసే నైతిక అర్హత ప్రభుత్వానికి లేదని తెలిపారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకున్నారో.. ఆ రోజు ఈ చర్య తీసుకుని ఉంటే ప్రజలు హర్షించేవారని చెప్పారు. ఈ చర్యలతో వాళ్లు సాధించిందేమీ లేదని.. తమకు వచ్చిన నష్టం కూడా…