పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి గౌరు చరిత రెడ్డి ప్రచారం ఉధృతం చేశారు. 2014లో పాణ్యం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాక నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
ఏపీలో ఎన్నికల వేళ టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సోదరుడు యనమల కృష్ణుడు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత నాలుగు దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీలో కొనసాగిన యనమల కృష్ణుడు నేడు సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఉదయగిరి నియోజకవర్గంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. రాజన్న దళం అధినేత మెట్టుకూరు చిరంజీవి రెడ్డి వైసీపీ పార్టీ సభ్యత్వానికి, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి మంగళవారం రాజీనామా చేశారు. రాజీనామా లేఖను రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపించారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 17వ రోజుకు చేరుకుంది.. శ్రీరామ నవమిని పురస్కరించుకుని బుధవారం బస్సు యాత్రకు విరామం ఇచ్చిన సీఎం జగన్.. నేడు(గురువారం) మళ్లీ యాత్రను ప్రారంభించనున్నారు.
ప్రస్తుతం దేశంలో లోక్ సభ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతుండగా.. ఆంధ్రప్రదేశ్లో ఓవైపు లోక్ సభ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు, మరోవైపు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన ఎన్నికలు ఒకేసారి జరగడంతో రాష్ట్రంలో రాజకీయ హీట్ మరింతగా జోరందుకుంది. ఇందులో భాగంగానే అన్ని ప్రముఖ రాజకీయ పార్టీలు ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల ప్రచారాలలో పెద్ద ఎత్తున కొనసాగిస్తుంది. ఇక పార్టీల పెద్దలు రాష్ట్ర మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రజలను మమేకం చేసుకుంటున్నారు.…
‘ఎవరైనా సరే ఒక వ్యక్తికి నమస్కారం పెట్టే స్థాయి నుంచి, మరో 10 మందికి స్ఫూర్తిగా ఎదిగే స్తాయికి ఎదగాలి. ప్రభుత్వం అనేది సంక్షేమం అందజేసి చేతులు దులుపుకోకూడదు, స్వయంగా సంపాదించుకునేలా ఉపాధి అవకాశం కల్పించాలి.’ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు.
జయవాడ రూరల్ మండలం రామవరప్పాడు గ్రామంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు ప్రజాగళం పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా రామవరప్పాడు గ్రామంలోని నెహ్రూనగర్, హనుమాన్ నగర్ కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ స్థానికులతో మమేకమయ్యారు.
పెమ్మసాని మాట్లాడుతూ.. అయితే, వ్యాపారస్తులు లేదా సహజ వనరులే లక్ష్యంగా కొందరు రాజకీయ నాయకులు దండుకుంటున్నారన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.