* విశాఖ రానున్న దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. రేపు సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో పాల్గొననున్న డిప్యూటీ సీఎం సత్యనారాయణ
* నేటి నుండి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గడప గడపకు వైసీపీ కార్యక్రమం
*నేడు శ్రీశైలంలో స్వామి అమ్మవార్లకు ఆలయంలో సహస్ర దీపాలంకరణ, వెండి రథోత్సవం
*నేడు టీడీపీ నేత నారా లోకేష్ కర్నూలు పర్యటన. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ నేత రాజవర్ధన్ రెడ్డి తండ్రి విష్ణువర్ధన్ రెడ్డి కుటుంబసభ్యులను పరామర్శించనున్న నారా లోకేష్
*పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పై సమీక్ష చేపట్టనున్న ముఖ్యమంత్రి జగన్. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో సమీక్ష
* నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం. రాష్ట్రవ్యాప్తంగా కేసీఆర్ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని పిలుపు
*తెలంగాణలో నేటి నుంచి గ్రూప్ 1 దరఖాస్తులు. ఈనెల 31 వరకూ దరఖాస్తులు దాఖలు చేసుకునే అవకాశం.
*నేడు ఒంగోలు రిమ్స్ కు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, మంత్రి ఆదిమూలపు సురేష్
*ఐపీఎల్ 2022: నేడు కోల్ కతాతో తలపడనున్న రాజస్థాన్. ముంబై వేదికగా రాత్రి 7.30కి మ్యాచ్
*ఏపీ, తెలంగాణలో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం
* భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలో 73 వ రోజు కొనసాగనున్న షర్మిల పాదయాత్ర. చిల్ల గుంపు గ్రామం లో రైతు గోస ధర్నా
* నేడు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇద్దరు మంత్రుల పర్యటన.నిర్మల్,మంచిర్యాల లో రెండు వేర్వేరు సమావేశాలు నిర్వహించనున్న మంత్రులు నిరంజన్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి.