సీఎం కాన్వాయ్ కోసం తిరుపతి వెళ్తున్న వారి వాహనాన్ని తీసుకున్న ఘటనపై స్పందించారు ఎంపీ విజయసాయి రెడ్డి. తప్పు చేసేవారిని తప్పకుండా చట్టం శిక్షిస్తుంది. రాష్ట్రంలో కొన్ని కోట్ల మంది ప్రజానీకం ఉంటారు. ఎవరో ఏదో తప్పు చేస్తూ ఉంటారు. ఎవరో ఒకరు తప్పు చేస్తే సమాజాన్నంతా నిందించడం సరికాదని హితవు పలికారు.
మాజీ సీఎం చంద్రబాబుకు మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ నోటీసులు ఇచ్చారని తెలుసు కానీ ఎందుకు నోటీసులు ఇచ్చారనేది పూర్తిగా తెలియదు . చట్టవ్యతిరేకంగా నోటీసులు ఇస్తే న్యాయస్థానాలలో వాటిని ఛాలెంజ్ చేయడం జరుగుతుందన్నారు విజయసాయిరెడ్డి. నోటీసు ఇవ్వటం తప్పయితే తప్పకుండా న్యాయస్థానాలు నిర్ణయిస్తాయి. నేరాల సంఖ్య చూస్తే చంద్రబాబు హయాం కన్నా చాలా చాలా తగ్గుముఖం పట్టాయి. సమాజంలో నేరాలు జరుగుతుంటాయి కానీ చంద్రబాబు హయాంతో పోలిస్తే చాలా తగ్గాయన్నారు విజయసాయిరెడ్డి.
Read Also: Gudivada Amarnath: పవన్ మీ సినిమా అట్టర్ ఫ్లాప్ గ్యారంటీ