AP CM Chandrababu: ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రులు అనిత, డోల బాలవీరాంజనేయ స్వామి, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, పొలిట్ బ్యూరో సభ్యుల వర్ల రామయ్యలు భేటీ అయ్యారు. అనంతపురం జిల్లాలో రాముల వారి రథానికి నిప్పు పెట్టిన ఘటనపై పోలీసులు, అధికారుల తీరుపై సీఎం వద్ద పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. నిందితులు వైసీపీ నేతలు అంటూనే రాజకీయ ప్రమేయం లేదనే అభిప్రాయాన్ని పోలీసులు వ్యక్తం చేయటాన్ని చంద్రబాబు వద్ద నేతలు ప్రస్తావించారు. పోలీసులు విచారణ పూర్తి చేయకుండా రాజకీయ ప్రమేయం లేదనడం సరికాదనే అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేశారు. కొందరు పోలీసులు అత్యుత్సాహంతో ప్రకటనలు ఇవ్వకుండా చూడాలని నేతలు కోరారు.
Read Also: Perni Nani: తెలియక అపచారం చేస్తే దేవుడు క్షమిస్తాడు.. కానీ, తిరుమల లడ్డూపై విష ప్రచారం..
వైసీపీ వ్యాప్తి చేయాలనుకుంటున్న అసత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు నేతలకు సూచించారు. మనం ప్రజలకు నిజం చెప్పేలోపు జగన్ అబద్దాలను ప్రచారం చేయాలని చూస్తున్నాడని.. ప్రభుత్వం-పార్టీ సమన్వయంతో కుట్రలను సమర్థంగా తిప్పి కొట్టాలన్నారు. కృష్ణా-గుంటూరు, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ గెలుపొందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు.