Ram Gopal Varma: డైరెక్టర్ ఆర్జీవీ అరెస్టుకు రంగం సిద్ధం!
- పోలీసులకు హ్యాండ్ ఇచ్చిన ఆర్జీవీ
- అరెస్టుకు రంగం సిద్ధం చేసిన పోలీసులు
- వర్మ ఇంటికి ఒంగోలు పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డైరెక్టర్ రాంగోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధమైంది. మరోసారి ప్రకాశం జిల్లా పోలీసులకు ఆర్జీవీ హ్యాండ్ ఇచ్చారు. ఇవాళ ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిన ఆయన డుమ్మా కొట్టారు. విచారణకు హాజరుకాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారణకు ఆర్జీవీ హాజరుకాకుంటే.. ఆయనను అరెస్ట్ చేసేందుకు హైదరాబాద్‌లోని వర్మ నివాసానికి ఇప్పటికే జిల్లా పోలీసులు చేరుకున్నారు.
ఈనెల 19న విచారణకి హాజరు కాకుండా డైరెక్టర్ రాంగోపాల్ వర్మ వారం రోజులు గడువు కోరటంతో.. ఆయన విజ్ఞప్తి మేరకు ఇవాళ హాజరు కావాలని 20వ తేదీన పోలీసులు మరోసారి నోటీసు ఇచ్చారు. ఆర్జీవీని విచారించేందుకు ఒంగోలు రూరల్ సర్కిల్ కార్యాలయంలో అన్నీ ఏర్పాట్లు చేశారు. తీరా అయన విచారణకు హాజరుకానని చెప్పడంతో.. అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. హైదరాబాద్‌లోని రాంగోపాల్ వర్మ ఇంటికి ఒంగోలు పోలీసులు ఇప్పటికే చేరుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి.. ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేసిన కేసులో వర్మ విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే రాంగోపాల్ వర్మ వ్యవహారంపై జిల్లా పోలీసుల సీరియస్‌గా ఉన్నారు.
Also Read
తాజావార్తలు
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
-
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
-
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
-
C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!