ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టుబడ్డ సొమ్ము, మద్యం, మత్తు పదార్థాల వివరాలను ఏపీ పోలీసు శాఖ వెల్లడించింది. 2019 ఎన్నికలతో పోల్చితే 2024లో ఏపీలో భారీగా మద్యం, డ్రగ్స్ భారీగా పట్టుబడ్డట్లు తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రెస్ నోట్ విడుదల చేసింది.
పోలీసులు అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఏకపక్షంగా వైసీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని.. అసలు ముద్దాయిలను వదిలేసి తప్పు చేయని వారిపై కేసులు పెడుతున్నారని ఆయన అన్నారు.హింస జరుగుతుందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు.
ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో రాష్ట్రంలో భద్రతను భారీగా పెంచారు. మళ్లీ ఘర్షణలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. పోలింగ్ రోజు జరిగిన హింసతో ఏపీ హై అలర్ట్ కొనసాగుతోంది. రాష్ట్రాన్ని పోలీసులు జల్లెడపడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతుండటంతో అల్లర్లు జరుగుతాయనే సమాచారంతో పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. ఇక, పల్నాడు జిల్లాలో పోలీసులను కౌంటింగ్ ప్రక్రియ టెన్షన్ పెడుతుంది.
ఎన్నికల పోలింగ్ అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్షన్ రోజు జరిగిన గొడవల్లో ఇప్పటికే 10 మందిని జైలుకు పంపడం జరిగిందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు పోలీసులు.. నడిరోడ్డుపైకి వచ్చి పబ్లిక్గా కొట్టుకోవడం చర్చగా మారింది.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది..
అప్పు చేసి తీర్చనందుకు చంపేందుకు కూడా వెనకాడలేదు ఓ వ్యక్తి. ఆటో నడుపుతూ.. జీవనం సాగిస్తున్న వ్యక్తిని అప్పు తీర్చలేడన్న కోపంతో అంతమొందించేందుకు పూనుకున్నాడు. ఈ దారుణం చంద్రగిరిలో చోటుచేసుకుంది.