ప్రభుత్వ జీవోలను మీరు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు.. అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. జీవోల గోప్యతపై హైకోర్టులో వేసిన పిటిషన్లపై ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఈ జన వాహిని చూస్తుంటే వైసీపీ గెలుపు ఖాయం అనిపిస్తోందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట బస్సుయాత్ర బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ఇసుకరాలనంత జనాలు సభలకు రావడం జగనన్న విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు ద్వారా సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతోందని, ఇందుకు రైతుల పక్షాన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన వ్యక్తం చేస్తున్నామని అని బిసి సంక్షేమ, సమాచార పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ , హోం మంత్రి తానేటి వనితలు పేర్కొన్నారు.
సామాజిక న్యాయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వల్లే సాధ్యమని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు జరిగిన మేలు వివరించేందుకే బస్సు యాత్ర చేపట్టామన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు వెనుకబడిన వర్గాలను విస్మరించారన్నారు.
రాష్ట్రం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కుల గణన ప్రక్రియ ప్రారంభించింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని నేలపర్తిపాడు గ్రామంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కులగణన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేణు మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ఏ ముఖ్యమంత్రి ఈ రకమైన సాహసం చేయలేదన్నారు.
పీలో కరువు విలయతాండవం చేస్తోందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, సీఎం జగన్ కనీసం స్పందించడం లేదన్నారు.
తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ టూరిజం కార్మికులు చేపట్టిన సమ్మెను ఎట్టకేలకు విరమించారు. అల్లూరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్తో టూరిజం కార్మికుల సంప్రదింపులు సఫలం కావడంతో వారు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు.
జగనన్న విద్యా కానుక కిట్లల్లో భారీ కుంభకోణానికి పాల్పడ్డారంటూ జనసేన కీలక ఆరోపణ చేసింది. నాసిరకం జగనన్న విద్యా కానుక కిట్లను ప్రెస్ మీట్లో నాదెండ్ల మనోహర్ ప్రదర్శించారు. ఇవాళ్టి నుంచి రోజుకో స్కీంలో జరిగిన కుంభకోణాన్ని బయట పెడతామని గతంలోనే జనసేన ప్రకటించింది.
ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి ఇంద్రకీలాద్రి ఆలయం మూసివేయనున్నారు. ఈరోజు దీపావళి సందర్భంగా అమ్మవారి ప్రధానాలయము నందు సాయంత్రం 5 గంటలకు ధనలక్శ్మి పూజను నిర్వహించారు. సాయంత్రం 06 గంటలకు అమ్మవారికి పంచహారతులు సేవను నిర్వహించారు.
విశాఖపట్నం జిల్లా మధురవాడ కొమ్మాది ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. మద్యం దుకాణంలో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. తనకు నచ్చిన బ్రాండ్ ఇవ్వలేదని మనస్థాపంతో ఈ విధంగా వీరంగం సృష్టించినట్లు తెలిసింది.