CM YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లోని భూమి లేని పేదలకు అసైన్డ్ భూముల పంపిణీ, భూములపై సర్వ హక్కులు కల్పిస్తూ పేద రైతుల సమస్యలను తీర్చేందుకు వైసీపీ సర్కారు సిద్ధమైంది. రేపు ఏలూరు జిల్లా నూజివీడులో జరిగే ఓ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా 46 వేల ఎకరాల అసైన్డ్, ఎల్పీఎస్ భూముల్ని లబ్ధిదారులకు పంపిణీ చేయబోతున్నారు. ఇందులో అసైన్డ్‌తో పాటు ఎల్పీఎస్ భూమలు కూడా ఉన్నాయి. వీటిని దళితులతో పాటు ఇతర వెనుకబడిన వర్గాల లబ్దిదారులకు అందిస్తారు. 2003కు మందు అసైన్‌మెంట్ భూములకు హక్కు కల్పించడం, కొత్త అసైన్‌మెంట్ భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు.
Also Read: Chelluboina Venugopalakrishna: చంద్రబాబు సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నాడు..
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే జగన్ సర్కార్ 20,24,709 మంది పేదలకు 35,44,866 ఎకరాల్లో భూ పంపిణీ చేసి భూములపై సర్వ హక్కులు కల్పించింది. అలాగే కొత్తగా భూముల అసైన్మెంట్ భూమి లేని దళిత, బడుగు, బలహీన వర్గాలకు, పేదలకు.. ఇప్పటికే అసైన్డ్, గ్రామ సర్వీస్ ఇనామ్ , ఎస్సీ కార్పొరేషన్ (LPS) భూములు పొందిన వారికి వాటిపై సర్వ హక్కులు కల్పించే భూ యాజమాన్య హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఏలూరు జిల్లా నూజివీడులో జరిగే ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దళితులకు స్మశాన వాటికలతో పాటు ఇతర పేదలకు భూముల కేటాయింపు పత్రాల్ని అందించబోతున్నారు. ఇందులో భాగంగా కొత్తగా 42,307 మంది పేదలకు 46,463 ఎకరాల అసైన్డ్ భూముల పంపిణీ చేయనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 9,064 ఎకరాల లంక భూముల్లో 17,768 మందికి అసైన్డ్/లీజు పట్టాలు ఇవ్వనున్నారు. అసైన్మెంట్ చేసి 20ఏళ్లు పూర్తయిన 15,21,160 మంది రైతులకు 27,41,698 ఎకరాల అసైన్డ్ భూములపై సంపూర్ణ భూ హక్కులు కల్పిస్తారు.
Also Read: Tammineni Sitaram: కులగణన కోసం శ్రీకాకుళం జిల్లా నుంచే శ్రీకారం..
1,563 గ్రామ సచివాలయాల పరిధిలో దళితుల స్మశాన వాటికలకు 951 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయిస్తోంది. ల్యాండ్ పర్చేజ్ స్కీం (LPS) క్రింద ఎస్సీ కార్పొరేషన్ పంపిణీ చేసిన 22,837 ఎకరాల భూములపై 22,346 మందికి సర్వ హక్కులు కల్పిస్తూ వాళ్ల రుణాలు మాఫీ చేయనున్నారు. దేశంలోనే తొలిసారి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించే ఉద్దేశంతో వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకాన్ని వైసీపీ ప్రభుత్వం చేపట్టింది.