CM YS Jagan: హౌసింగ్ కింద ఇళ్ల నిర్మాణం వేగాన్ని పెంచాలి.. అధికారులకు సీఎం ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: గృహ నిర్మాణ శాఖపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ కింద ఇళ్ల నిర్మాణం వేగాన్ని పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గడిచిన అక్టోబరులో 7.43 లక్షల ఇళ్లను ఇప్పటికే మహిళలకు అందించామని అధికారులు సీఎంకు తెలిపారు. ఫిబ్రవరి నాటికి మరో 5 లక్షల ఇళ్లు పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతున్నామని అధికారులు చెప్పారు. వీటికి సంబంధించిన పనులు చాలా చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు.
Also Read: Sajjala Ramakrishna Reddy: చంద్రబాబు మెడికల్ రిపోర్టు ఇచ్చింది వైద్యులా, పొలిటికల్ డాక్టర్లా?
Also Read
- Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
- Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
- 5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
- ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
కాలనీల్లో మౌలిక సదుపాయాలపై నిరంతరం పర్యవేక్షణ జరపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఎక్కడ ఏ సమస్యను గుర్తించినా వెంటనే దాన్ని సరిదిద్దేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కరెంటు, తాగునీరు, సోక్ పిట్స్ ఉన్నాయా? లేవా? అన్నవాటిపై ఆడిట్ చేయించాలన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం ఇప్పటిరకూ 12,72,143 మంది అక్కచెల్లెమ్మలకు పావలా వడ్డీకే రూ.35వేల చొప్పున రుణాలు అందించామన్నారు సీఎం జగన్. రూ.4,483 కోట్ల రుణాలు అక్కా చెల్లెమ్మలు అందుకున్నారన్నారు. పావలా వడ్డీ రుణాలపై చెల్లించాల్సిన మిగిలిన వడ్డీ భారాన్ని ప్రభుత్వం భరించనుందన్నారు.ఇప్పటి వరకూ తీసుకున్న రుణాలపై వడ్డీ డబ్బు విడుదలకు సన్నద్ధం కావాలని సీఎం అధికారులను ఆదేశించారు.
Also Read: Nandamuri Balakrishna: ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన బాలకృష్ణ.. ప్రభుత్వంపై ఫైర్
టిడ్కో ఇళ్ల నిర్మాణంపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. టిడ్కో ఇళ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్న సీఎం ఆదేశించారు. లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన అసోసియేషన్లు సమర్థవంతంగా పని చేసేలా వారికి తగిన అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన లక్షల విలువైన ఆస్తిని ఎలా నిర్వహించుకోవాలన్నదానిపై వారికి అవగాహన ఇవ్వాలన్నారు. తద్వారా భవనాలు నిరంతరం నాణ్యతగా ఉండేలా, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోగలుగుతారన్నారని వెల్లడించారు. ఈ విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సీఎం చెప్పారు.
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!