రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భూములకు హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. దీనివల్ల 20 ఏళ్లుగా భూమిని సాగు చేస్తున్న వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.
చంద్రబాబు లాయర్ హైకోర్టులో మెమో ఫైల్ చేశారని.. గుండె పరిమాణం పెరిగిందని చెబుతున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుతున్నామన్నారు. వాదనలలో తాను నిప్పు అంటూ స్క్వాష్ పిటిషన్ వేశారన్నారు. మానవతా దృక్పదంతోనే, ఆరోగ్య కారణాలతోనే బెయిల్ వచ్చిందన్నారు. నిజం గెలవాలని తిరిగినా ఆవిడ ఎక్కడుందంటూ మంత్రి ఎద్దేవా చేశారు.
విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఈవో కె.ఎస్.రామారావుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాళహస్తి ఈవోగా రామారావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే బదిలీ అయిన ఆజాద్కు కమిషనర్ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో బీసీ సమస్యలపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీలో జరుగుతోన్న బీసీ కులగణనపై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీల ఓట్లు తొలగించి, వారి పథకాల్లో కోత పెట్టేందుకే కులగణన పేరుతో వైసీపీ ప్రభుత్వం సర్వే చేస్తోందని టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్లోని భూమి లేని పేదలకు అసైన్డ్ భూముల పంపిణీ, భూములపై సర్వ హక్కులు కల్పిస్తూ పేద రైతుల సమస్యలను తీర్చేందుకు వైసీపీ సర్కారు సిద్ధమైంది. రేపు ఏలూరు జిల్లా నూజివీడులో జరిగే ఓ కార్యక్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకంగా 46 వేల ఎకరాల అసైన్డ్, ఎల్పీఎస్ భూముల్ని లబ్ధిదారులకు పంపిణీ చేయబోతున్నారు.
ప్రతిపక్షాలు అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని.. అది తప్పు అని చెప్పడానికే ఈ సభ ఉద్దేశమని విజయనగరం జిల్లా రాజాంలో సామాజిక సాధికారిక యాత్రలో స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. జగన్మోహన్ రెడ్డి సామాజిక, సాధికారిక జైత్రయాత్ర ఇది అంటూ ఆయన పేర్కొన్నారు. జోగులు అందరివాడు.. సామాన్య జనంతో కలిసిపోయే మనసత్వం ఉన్న వ్యక్తి అని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు.
చంద్రబాబు మోసగాడు, నిజం మాట్లాడని వ్యక్తి రైతును మోసం చేశాడు 87 వేల కోట్ల రుణాలు రైతు రుణాలు మాఫీ చేస్తానన్నాడని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు.
గృహ నిర్మాణ శాఖపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హౌసింగ్ కింద ఇళ్ల నిర్మాణం వేగాన్ని పెంచాలని అధికారులను సీఎం ఆదేశించారు.
ఈ నెల 17న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా నూజివీడులో పర్యటించనున్నారు. 2003కు మందు అసైన్మెంట్ భూములకు హక్కు కల్పించడం, కొత్త అసైన్మెంట్ భూములకు పట్టాల పంపిణీ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.