AP High Court: ప్రభుత్వ జీవోలను మీరు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు.. అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. జీవోల గోప్యతపై హైకోర్టులో వేసిన పిటిషన్లపై ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. జీవోల గోప్యతపై హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. బుధవారం పిటిషన్లు రీచ్ కాకపోవడంతో ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ముందు విచారణ జరపారని న్యాయవాదులు ఉమేష్ చంద్ర, అంబటి సుధాకర్, యలమంజుల బాలాజీ, శ్రీకాంత్ ఈ విషయాన్ని ప్రస్తావించారు.
Also Read: Seediri Appalaraju: 33 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత వైసీపీదే..
2021లో వేసిన పిటిషన్ పై ఇంకా విచారణ జరగుతుందని న్యాయవాదులు చెప్పారు. 70 శాతం జీవోలను వెబ్ సైట్‌లో పెట్టడం లేదని ప్రభుత్వమే అఫిడవిట్ వేసిందని న్యాయవాది ఉమేష్ చంద్ర పేర్కొన్నారు. జీవోల ద్వారా హక్కులు సంక్రమిస్తాయి.. ఆ హక్కులను మీరెలా కాలరాస్తారు అని ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై తాను పూర్తి వివరాలు అందిస్తానని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. పిటిషన్‌పై విచారణ చేపట్టాలని కోరిన పిటిషనర్‌ల తరపు న్యాయవాదులు కోరారు. వచ్చే బుధవారం విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.