Seediri Appalaraju: ఈ జన వాహిని చూస్తుంటే వైసీపీ గెలుపు ఖాయం అనిపిస్తోందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట బస్సుయాత్ర బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. ఇసుకరాలనంత జనాలు సభలకు రావడం జగనన్న విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 1983 నుంచి 2014 వరకు 53 వేలు ఇళ్లు ఇచ్చారని.. కానీ ఈ నాలుగున్నరేళ్లలో 33 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఘనత వైసీపీదేనన్నారు. ఈ రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా చూసిన బస్సు యాత్రకు వచ్చే వాళ్లే తప్ప బస్సు యాత్ర విమర్శించే వాళ్ళు లేరన్నారు.
Also Read: Minister Jogi Ramesh: సామాజిక న్యాయం గురించి చంద్రబాబు, పవన్‌లు మాట్లాడలేదు..
మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. “ఈ బస్సు యాత్ర జగనన్న పండగ యాత్ర. బాబు బీసీలను జడ్జిలుగా పనికిరాని సుప్రీంకోర్టుకి లెటర్ రాసిన ఘనుడు. ఎస్సీ ఎస్టీలు ఎవరైనా పుడతారా అంటూ దళితుల అవమానించిన ఘనుడు బాబు. పుష్ప వాణిశ్రీ గిరిజన బిడ్డ అలాగే బీసీ ఎస్సీ ఎస్టీలు మన నాయకుడు పక్కనే కూర్చునెలా స్థానం కల్పించిన మహోన్నత వ్యక్తి జగన్. 14 సం ముఖ్య.మంత్రి గా చేసిన బాబు ఏమి చేశారు. ఇప్పుడు మళ్ళీ అవకాశం ఇవ్వండి సంపద సృష్టిస్తానని అబద్ధాలు ఆడుతున్నాడు. మా పేదల ఆక్రోసమే చంద్రబాబుకి తగిలి 23 సీట్లకి పరిమితమై ఓ మూలన కూర్చుని ఏడుస్తున్నాడు. జిల్లాకి ఒక కేంద్ర సంస్థలు కూడా తెప్పించుకోలేని దౌర్భాగ్య స్థితిలో మన ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నాడు. ఈ జిల్లాకి రామ్మోహన్ నాయుడు ఏం చేశాడు. పలాస రైల్వే స్టేషన్‌కి స్టీల్ కుర్చీలు చేసిన ఘనత ఎంపీ రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం జిల్లాకి రామ్మోహన్ నాయుడు చేసింది స్టీల్ కుర్చీలు తప్ప ఇంకేమీ చేయలేదు. చంద్రబాబు నాయుడు సీఎంగా వంశధారపై ఏమి చేయలేదు. ఒడిస్సా రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి నేరెడీ బ్యారేజ్ కి ఓకే చేశారు జగన్. నాయకుడు లేకున్నా కటౌట్ తోటే యాత్రలో విజయవంతం చేసిన ఘనత మా జగన్ ప్రభుత్వానిది. నరసన్నపేట టిడిపి వాళ్లు ఈ జనావాహిని చూసి రాబోయే ఎన్నికల నుండి తప్పుకుంటారు.” అని మంత్రి పేర్కొన్నారు.